32.3 C
India
Thursday, April 25, 2024
More

    Shanmukh Jaswanth : సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది.. షణ్ముక్ జశ్వంత్ షాకింగ్ కామెంట్స్

    Date:

    Shanmukh Jaswanth
    Shanmukh Jaswanth

    Shanmukh Jaswanth : ప్రముఖ యూ ట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, షార్ట్ ఫిల్మ్స్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వత్‌ను గంజాయి కేసులో నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసులో షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లగా.. షణ్ముక్, ఆయన తమ్ముడు సంపత్ వినయ్ గంజాయి తాగుతూ పట్టుబడ్డాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు.

    ఇంతలో, షణ్ముక్ తాను చనిపోవాలనుకుంటున్నట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో షణ్ముఖ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘నేను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాను. నాకు చావాలని ఉంది.’ అని మాట్లాడాడు. డిప్రెషన్‌తో షణ్ముఖ్ గంజాయి వాడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా అనే ఊహాగానాలకు ఈ వీడియో తెరలేపింది.

    షణ్ముక్ జశ్వంత్ వ్యవహారం కొన్ని రోజులుగా దుమారం రేపుతోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న షణ్ముక్ చాలా డీప్రెషన్ గా ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుతం డిప్రెషన్‌లో ఉన్నాను. ఒక్కోసారి సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది. డిప్రెషన్ కారణంగానే డ్రగ్స్ తీసుకున్నా అంటూ పోలీసుల సమక్షంలో షణ్ముక్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

    తనను ప్రేమ, పెళ్లి పేరుతో వాడుకొని మరో యువతిని వివాహం చేసుకొని తనను మోసం చేశాడని సంపత్ వినయ్ పై వైజాగ్‌కు చెందిన డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షణ్ముక్ జశ్వంత్ గంజాయి తాగుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. సంపత్ వినయ్ తో కలిసి అన్న షణ్ముక్ జశ్వంత్ కూడా గంజాయి పీలుస్తున్నాడని పోలీసులు చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related