
Dancer Aata Sandeep : డ్యాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ గురించి అందరికి తెలుసు.. ఇతడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమా ఈవెంట్స్ వేదికపై తన టీమ్ తో కలిసి డ్యాన్స్ వేస్తూ స్టేజ్ దద్దరిల్లి పోయేలా చేస్తాడు.. అంతేకాదు ఈ యంగ్ కొరియోగ్రాఫర్ తన భార్యతో కలిసి కూడా అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను రిలీజ్ చేస్తాడు..
ఇతడు భార్యతో కలిసి చేసే డ్యాన్స్ వీడియోలకు ఫ్యాన్స్ నుండి భారీ స్పందన రావడమే కాకుండా ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఆట సందీప్ తన భార్య ముందే ప్రియురాలితో రొమాన్స్ చేసాడు.. అంతేకాదు తన భార్యే దగ్గరుండి మరీ లిప్ లాక్ లు పెట్టించిందని ఆయన ఓపెన్ గా చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
ఆట సందీప్ ఆయన భార్య జ్యోతి రాజ్ కలిసి నటించిన సినిమా లవ్యూ టు.. ఈ సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారు.. డ్యాన్స్ మాస్టర్ మరో యువతితో ప్రేమలో పడగా జరిగే సన్నివేశాల గురించి చెప్పే కథనే ఈ సినిమా అని తెలుస్తుంది.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ సందర్భంగా ఆట సందీప్ తన భార్య గురించి చెప్పుకొచ్చాడు.
నా భార్య చాలా మంచిది.. ఈ సినిమా కోసం నాకు చాలా బాగా సపోర్ట్ గా నిలిచింది.. అంతేకాదు రొమాన్స్ సన్నివేశాలను దగ్గరుండి చేయించింది.. అంటూ చెబుతుండగా ఈయన భార్య జ్యోతి రాజ్ మాట్లాడుతూ.. ఈ మూవీ డైరెక్టర్ ఒక సీన్ చెప్పగా ఇది ఎమోషనల్ సీన్స్ కాబట్టి దగ్గరుండి సపోర్ట్ చేశాను అని ఆమె తెలిపింది. ఈ కామెంట్స్ విన్నవారంతా అబ్బా ఇంత మంచి భార్య మాకు కూడా వస్తే బాగుండు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..






