Aamani ఎక్స్ పోజింగ్ చేయని హీరోయిన్లు అతి కొద్ది మందే ఉన్నారు. తెలుగులో తెలుగు హీరోయిన్ల హవా తక్కువగా ఉన్న రోజుల్లో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్న నటి ఆమని. ఎన్నో చిత్రాల్లో మంచి నటనకు అవార్డులు రివార్డులు సైతం అందుకుంది. మావిచిగురు నటనలో ఆమె నటన చూసి అందరు మంత్రముగ్దులయ్యారు. జంబలకిడిపంబ సినిమా ద్వారా రంగ ప్రవేశం చేసిన నెల్లూరు నెరజానా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
తరువాత కెరీర్ మంచి పొజిషన్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. సంసారానికి పరిమితమైంది. పిల్లలు కలిగాక సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికింది. కానీ సినిమాలకు స్వస్తి పలికినందుకు బాధపడింది. ఓ ఇంటర్వ్యూలో ఇలా బాధపడింది. కెరీర్ మంచి స్థాయిలో ఉండగానే సినిమాలకు దూరం కావడం బాధ కలిగించిందని వాపో యింది.
పెద్ద పెద్ద బ్యానర్లు కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఆమె మాత్రం తన భర్తకు ఇచ్చిన మాట కోసం సినిమాలకు దూరంగా ఉండిపో వాల్సి వచ్చింది. లేకపోతే ఇంకా పలు సినిమాల్లో నటించి తన పర్ఫార్మెన్స్ చూపించుకునేది. కానీ ఆ అవకాశం లేకుండా పో యింది. ఆమని పోషించిన పాత్రలు ఇప్పటికి ప్రేక్షకుల గుండెల్లో అలాగే మిగిలిపోయాయి.
ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి ముందుకొచ్చినా ఇప్పుడు అవకాశాల్లేవు. అవకాశాలు వస్తే నటించాలని భర్తను అడిగినా ఆయన సరే అనడంతో సిద్ధంగా ఉన్నా అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. వయసులో ఉన్నప్పుడే నటనకు అవకాశం ఉంటుంది. చెరువులో నీళ్లు చెరువు వెనక పడ్డాక ఏం లాభం అని బాధపడుతోంది.
ReplyForward
|