I movie Heroine : పూర్వం రోజుల్లో హీరోయిన్ గా వస్తే ఓ దశాబ్దం పాటు తన ప్రతిభతో ఎందరితోనో నటించేవారు. ఆ కోవలో సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి, రాధ, రాధిక, సుమలత వంటి వారు తమ ఉనికిని పదేళ్లకు పైగా నిరూపించుకునే వారు. కానీ ఇప్పుడు సినిమాకో హీరోయిన్ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఎప్పుడు ఏ హీరోయిన్ పక్కకు తప్పుకుంటుందో తెలియడం లేదు.
ఆ మధ్యన తెలుగు తెరకు వచ్చిన హీరోయిన అమీ జాక్సన్. పలు చిత్రాల్లో నటించినా చివరకు తెరమరుగైంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించినా ఆశించిన విజయాలు లేకపోవడంతో రంగం నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. బ్రిటన్ కు చెందిన ఈమెను చూస్తే ఎవరు గుర్తు పట్టకుండా తయారయింది.
తమిళ చిత్రం ముద్రాసపట్టినం సినిమాతో పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా విజయం సాధించడంతో అవకాశాలు రావడంతో శంకర్ దర్శకత్వంలో ఐ, 2.0 లాంటి సినిమాలో నటించింది. ఎవడు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. రజనీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్, రాంచరణ్ వంటి హీరోలతో జత కట్టింది. కన్నడ సినిమా ది విలన్ లో శివరాజ్ కుమార్, సుదీప్ లతో కలిసి నటించింది.
రోబో 2.ఓ తరువాత సినిమాలకు దూరమైంది. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయింది. నటనకు గుడ్ బై చెప్పి పెళ్లి కాకుండానే తల్లి అయింది. భర్తతో బ్రేకప్ చెప్పి మళ్లీ లవ్ లో పడింది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. కొడుకు, లవర్ తో గడిపింది. తరువాత మిషన్ చాప్టర్ 1, అచ్చమ్ ఎన్నతు ఇల్యాయే అనే చిత్రంలో చేస్తోంది. ఇందులో అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు.
తాజాగా అమీ జాక్సన్ లండన్ ఫ్యాషన్ వీక్ లో రెడ్ కలర్ దుస్తుల్లో కనిపించింది. ఇన్ స్టా గ్రామ్ లో తన ఫొటోలు షేర్ చేసింది. అందులో కొత్తగా కనిపించింది. అదరగొట్టే లుక్ లో అందరికి షాక్ ఇచ్చింది. వాటిని చూస్తూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడున్నావని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయిన ఆమె మళ్లీ ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.