Vishnu Priya తన మాటల ప్రవాహంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లలో విష్ణుప్రియ ఒకరు.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ముందుగా సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ ఆ తర్వాత వెండితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది..
అయితే అక్కడ ఈమె సక్సెస్ కాలేక పోయింది. దీంతో విష్ణు ప్రియ వెండితెరకు గుడ్ బై చెప్పి బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. మంచి యాంకర్ గా ఎదిగిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రజెంట్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది..ఇదిలా ఉండగా ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కాస్టింగ్ కౌచ్ మీద కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
కాస్టింగ్ కౌచ్ మీద ఈమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువుగా ఉంది.. కానీ అది చేసుకోవాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది.. నన్ను ఉదాహరణగా తీసుకుంటే.. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే కాస్టింగ్ కౌచ్ నన్ను ఇబ్బంది పెట్టింది.
కొంత మంది నన్ను కూడా కోరిక తీర్చమంటూ కెరీర్ స్టార్టింగ్ లో అడిగారు.. కానీ నేను ఒప్పుకోలేదు.. ఒప్పుకున్న వారిని తప్పుగా చూడాల్సిన పని లేదు.. ఎందుకంటే వారి అభిప్రాయాలు వారివి.. కాబట్టి మనం ఇవన్నీ పట్టించు కోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.