
Samantha and Kriti shetty : పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా సరికొత్త రికార్డులను అందుకుంది.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ఈ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్ అంతలా హిట్ అయ్యింది.. ఈ సినిమాలో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మామ అనే సాంగ్ యావత్ ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసింది..
మరి ఈ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత చిందేసిన విషయం తెలిసిందే.. ఈ సాంగ్ తోనే ఈమె యావత్ ఇండియా ఫేమస్ అయ్యింది.. కెరీర్ లో సమంత మొదటిసారి చిందేసిన ఐటెం సాంగ్ ఇది.. షార్ట్ ఫ్రాక్ లో ఆమె వేసిన బోల్డ్ స్టెప్స్ కు యూత్ మొత్తం ఊగిపోయింది..
మరి అలాంటి సాంగ్ ను యంగ్ హీరోయిన్ కృతి శెట్టి అయితే చేయదట.. ఎందుకో కూడా ఈమె చెప్పుకొచ్చింది.. తాజాగా ఈమె నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ బ్యూటీకి సామ్ చేసిన లాంటి ఈ సాంగ్ వస్తే మీరు చేస్తారా అని అడుగగా.. చేయను అని చెప్పుకొచ్చింది..
ప్రజెంట్ అలాంటి సాంగ్స్ చేసే ఆలోచన లేదని.. ఎందుకంటే ఆ సాంగ్స్ పట్ల నాకు అవగాహన లేదని ఎప్పుడు ఆలోచించలేదని కూడా తెలిపింది.. ఇన్నేళ్ల కెరీర్ లో నేను నేర్చుకున్నది అవగాహన లేకపోతే చేయకూడదు అని చెప్పింది.. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు ఇబ్బందిగా ఉన్నాయని.. అవి చేయకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నానని తెలిపింది.