33.7 C
India
Thursday, June 13, 2024
More

  Janhvi Kapoor : నాకు తెలియకుండానే పెళ్లి కూడా చేస్తారేమో.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు

  Date:

  Janhvi Kapoor
  Janhvi Kapoor

  Janhvi Kapoor : బాలీవుడ్‌ హీరోయిన్‌, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తెలుగు మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరూ పాన్ ఇండియన్ స్టార్ హీరోల సరసన ఎంపిక కావడంతో రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో జాన్వీ దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్ తో బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న మూవీలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లో బిజీబిజీగా ఉన్న ఈ అమ్మడి పెళ్లి గురించి నిత్యం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి.

  తాజాగా వీటిపై జాన్వీ స్పందించింది. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై వచ్చిన రూమర్స్‌కు జాన్వీ చెక్‌ పెట్టింది. ఇటీవల తన పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్ని చదివానని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారని, పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన రెండు, మూడు కథనాలు మిక్స్‌ చేసి అలా రాశారని తెలిపింది.. తనకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని జాన్వీ స్పష్టం చేసింది. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడినట్లు అయింది. ఇక ఇటీవల జాన్వీ పెళ్లిపై ఓ నెటిజన్‌ పోస్ట్‌ పెట్టగా.. దానికి ఆమె రియాక్ట్‌ అయ్యారు. ‘ఏదైనా రాస్తారా..’ అని రిప్లయ్ పెట్టింది.

  మరోవైపు జాన్వీ తాజాగా సోషల్‌ మీడియా వెబ్‌ సైట్‌ రెడిట్‌ లో యూజర్లతో చిట్‌చాట్‌ చేశారు. ఇందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లయ్ వైరల్‌గా మారింది. ‘మనం డేట్‌కు వెళ్దామా? అది మంచి స్టోరీ అవుతుంది’ అని ఓ యూజర్‌ అడగ్గా దానికి జాన్వీ సరదాగా స్పందించారు. ‘నువ్వు గొడ్డలితో నరికి చంపేసే హంతకుడివి అయితే ఎలా ?’ అన్నారు. రెడిట్‌ను తనకంటే తన చెల్లి ఖుషీనే ఎక్కువగా వాడుతుందని చెప్పారు. ఇందులో విశేషాలు చెల్లిని అడిగి తెలుసుకుంటానని జాన్వీ వెల్లడించారు. సోషల్‌ మీడియా అంటే భయమని ఈ ‘దేవర’ భామ తెలిపారు. జాన్వీ ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే31న ప్రేక్షకుల ముందుకురానుంది.

  Share post:

  More like this
  Related

  T20 World Cup : టీ20 వరల్డ్ కప్ వేళ ప్రవాసుల సందిగ్ధం..

  T20 World Cup : క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో పుట్టినా.....

  Bhadrachalam : రామయ్య హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

  Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని...

  Actor Prithviraj : నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ

  Actor Prithviraj : ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ ‘ఖడ్గం’లో...

  104 Employee Protest : అరగుండు, అరమీసంతో.. 104 ఉద్యోగి నిరసన

  104 Employee Protest : ఓ అధికారి అవినీతిని బహిర్గతం చేసినందుకు...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Rajinikanth-NTR : బాక్సాఫీస్ వద్ద తలపడనున్న రజనీకాంత్, యంగ్ టైగర్..

  Rajinikanth-NTR : జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్...

  NTR-Chiranjeevi : తారక్ కు మెగాస్టార్ విషెస్.. యంగ్ స్టార్ రీ ట్వీట్ ఏం చేశారంటే?

  NTR-Chiranjeevi : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ సెలబ్రిటీగా మారిన...

  Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

  Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...