
Dengue disease : డెంగీ ప్రాణాంతక వ్యాధి. ఇది సోకితే మరణమే శరణ్యం. డెంగ్యూ దోమ వల్ల వస్తుంది. ఈడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం ద్వారా డెంగీ వ్యాపిస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు ఎక్కువవుతాయి. ఎర్ర రక్తకణాలు తగ్గిపోతాయి. దీంతో ప్రాణాలే పోయే అవకాశం ఉంటుంది. ఇరవై వేల కన్నా తక్కువ రక్తకణాలు ఉంటే బయట నుంచి ఎక్కించాల్సిందే. ఇలా డెంగ్యూ వస్తే చాలా ఇబ్బందులే.
జీవితంలో గరిష్టంగా నాలుగు సార్లు డెంగీ వచ్చే అవకాశముంటుంది. రెండు, మూడో సారి మరో రకం వైరస్ తో జ్వరం వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. డెంగ్యూ లక్షణాల్లో హఠాత్తుగా జ్వరం రావడం, భరించలేనంత తలనొప్పి, కళ్ల వెనక నొప్పి, కళ్లు ఎర్ర బడటం, వాంతి, వికారం, ఒళ్లు కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం, చర్మం మీద దద్దుర్లు వంటివి కనిపిస్తాయి.
డెంగీ ప్రాణాలు తీసేంత ప్రమాకరమైనది. నిర్లక్ష్యంగా ఉంటే నష్టమే. కొందరిలో లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత పది శాతం మందిలోనే లక్షణాలు తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు లక్షణాలే కనిపిస్తాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి కామన్ గా కనిపించవచ్చు.
డెంగ్యూ పూర్తిగా తగ్గినట్లు ఎలా గుర్తించొచ్చు. నాడీ వేగం, రక్తపోటు, శ్వాస తీసుకోవడం మామూలు స్థాయికి వచ్చినప్పుడే వ్యాధి నయమైనట్లు గుర్తించాలి. ఆకలి పెరగడం, మూత్రంలో ఇబ్బందులు లేకపోవడం, హిమోగ్లోబిన్ స్థాయిలు స్థిరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తేనే డెంగీ పూర్తిగా తగ్గినట్లు భావించాలి.