Bhagya Sri Bhorse : టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే తొలి సినిమా విడుదలకు ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ అంతా భాగ్యశ్రీ జపం చేస్తున్నది. తొలి లుక్ తోనే అంతలా ముద్ర వేసింది భాగ్యశ్రీ. “మిస్టర్ బచ్చన్”తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నది. తన మొదటి సినిమాకే అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నది.
తన గ్లామర్, సినిమాలో కనిపించిన తీరు, ట్రైలర్ లో భాగ్యశ్రీ విజువల్స్, రవితేజతో డ్యాన్సులు, రోమాన్స్ తో కుర్రకారును పిచ్చక్కెస్తున్నది. ఎక్కడ చూసిన ఈ లేటెస్ట్ హాట్ బ్యూటీ గురించే చర్చ జరుగుతున్నది. కాగా ప్రీ రీలీజ్ ఈవెంట్ లో భాగ్యశ్రీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ సందర్బంగా జరిగిన పలు ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించింది. హీరో రవితేజ తనని రాణిలా ట్రీట్ చేశాడంటూ చెప్పుకొచ్చింది. ప్రతి షాట్ లో రవితేజ తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచారని వెల్లడిచింది. భాగ్యశ్రీ ఈ ఆసక్తికర కామెంట్స్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
రవితేజ ఇప్పటి దాకా ఎంతోమంది యంగ్ హీరోయిన్స్, కొత్త వారితో పని చేశాడు. రవితేజ గత సినిమాల్లోనే ఖిలాడీ లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి తన సినిమాలతోనే హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. కానీ వారెవరూ చేయని కామెంట్స్ భాగ్యశ్రీ చేయడం ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ రవితేజ పై ఉన్న అభిమానంతో చెప్పిందో లేక వేరే ఇంకేదైనా ఉందో అది వారికే తెలియాలి.
బాలీవుడ్ హిట్ సినిమా “రైడ్” .. దీనిని హరీశ్ శంకర్ రీమేక్ చేశాడు. విలన్ పాత్రలో జగపతిబాబు నటించారు. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు అందించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఆగస్టు 15 థియేటర్లలో విడుదల కాబోతున్నది. కాగా దీనికి ఒక రోజు ముందుగానే (ఆగస్ట్ 14 సాయంత్రం) తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలతో పలకరించనుంది. ప్రస్తుతానికైతే భాగ్యశ్రీ బోర్సే “మిస్టర్ బచ్చన్” ఫలితం పైనే చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమాతో భాగ్యశ్రీ టాలీవుడ్ లో హిట్ కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే.