
Virat comments on RR : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తన 12వ లీగ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం (మే 14) జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ వేదికగా ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం తర్వాత ఆర్సీబీ వెటరన్ బ్యాట్స్‌మన్ విరాట్ షాకింక్ కామెంట్స్ చేశాడు. ‘నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ వాళ్లు 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారంటూ’ షాకింగ్ విషయాలు చెప్పారు. ఆర్సీబీ, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 172 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కేవలం 10.3 ఓవర్లలో 59 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది. ఇది ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు రెండో అత్యల్ప స్కోరు.. ఐపీఎల్ హిస్టరీలో మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది.
మ్యాచ్ తర్వాత ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడారు.. ‘నేను బౌలింగ్ చేసి ఉంటే ఆర్ఆర్ ప్లేయర్స్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారు’ అని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన లయతో కనిపించారు. జట్టు తరఫున ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్ మూడు ఓవర్లలో 10 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు మైకేల్ బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మత రెండు వికెట్లు తీశారు. బ్రేస్‌వెల్ మూడు ఓవర్లలో 16 పరుగులు ఇవ్వగా, కర్ణ్ శర్మ 1.3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చాడు. మరోవైపు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రెండు ఓవర్లలో 10 పరుగులిచ్చి ఒక వికెట్, గ్లెన్ మాక్స్ వెల్ ఒక ఓవర్ లో మూడు పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడి ఉంటే ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించేది. ఈ విజయం తర్వాత ఆ జట్టు 12 మ్యాచుల్లో 12 పాయింట్లు సాధించింది. ఇప్పుడు ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ద్వారా ప్లేఆఫ్స్ అర్హత సాధిస్తుంది. ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడిపోతే ఎలిమినేట్ అవుతుంది.