
Kavitha arrested : ఢిల్లీ మధ్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగేదని ఆ పార్టీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం (మే 19) ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సొంత పార్టీపైనే సెటైర్లు వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా వీటని నమ్మతున్నట్లు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంకో 5 నెల్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, దానికి రాష్ట్రంలో బీజేపీ వేగం సరిపోవడం లేదన్నారు. ఇతర పార్టీలు ఇప్పుడు జోరుగా పని చేస్తుంటే బీజేపీ ఈ సమయంలోనే వెనుకబడుున్నట్లు అనిపిస్తుందన్నారు. కేసీఆర్ ను దెబ్బకొట్టడంలో బీజేపీ సఫలీకృతం అవుతుందా అన్నదానిపై ప్రజల్లో అనుమానాలు మొదలైనట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఆయన కుటుంబ పాలనను దెబ్బతీసేందుకు బీజేపీ సీరియస్ గా ఉందని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరంఉందని ఆయన చెప్పుకచ్చారు. మొదట్లో దీన్ని జోరుగా జనాల్లోకి తీసుకెళ్లిన బీజేపీ ఇప్పుడు ఎందుకు వెనుకబడుతుందో తెలియడం లేదన్నారు.
మద్యం కేసులో ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని ప్రజలు అనుకుంటున్నారని, దీనిపైనే తమ పార్టీ నాయకులు ప్రకటనలు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఈ కేసు నెమ్మదించిందన్నారు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకుంటే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందన్నారు. ప్రస్తుతం తమ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. అయితే ఈటల రాజేందర్ చేరికల కమిటీలో తాను కూడా మెంబరేనన్నారు.