
Modi satires : ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ముందుగా న్యూయార్క్ వెళ్లిన ఆయన, ఆ తర్వాత వాషింగ్టిన్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఎన్ఆర్ఐలు బ్రహ్మరథం పట్టారు. అయితే అమెరికన్ కాంగ్రెస్ తో పాటు మోడీ పలు ప్రాంతాల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన వాగ్ధాటితో ఆకట్టుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్లి బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భేటీ అయ్యారు. పాక్, చైనాకు హెచ్చరికలు జారీ చేస్తూనే మరోసారి తనదైన శైలిలో మాట్లాడారు. ఈ సభలకు భారతీయులతో పాటు అమెరికన్లు కూడా హాజరయ్యారు. అయితే ఎన్నికలకు ఏడాది ముందు మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే మోడీ మరోసారి సమోసా డైలాగ్ వదిలారు. గతంలో ఒకసారి కూడా ఆయన సమోసాలో ఆలు ఉన్నంత కాలం.. బిహార్ లో లాలును ఏం చేయలేరు అంటూ సమోసా డైలాగ్ వదిలారు. ఈ డైలాగ్ ఇటీవల వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. తాజాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీకి విందు సందర్భంగా మెనూలో కమలాహారిస్ సమోసాలు పెట్టించారు. దీనిని ఉద్దేశిస్తూ భారత్, అమెరికాల మధ్య అవినాభావ సంబంధం ఉందని, మిత్రబంధం పెద్దదని చెప్పుకొచ్చారు.
భారత్ నుంచి ఇక్కడికి వచ్చిన వారితో అమెరికాలో కూడా భారత ఆహార ఆలవాట్లు వచ్చేశాయని చెప్పారు. దీంతో పాటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఉద్దేశిస్తూ సమోసా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె పగలబడి నవ్వారు. అక్కడున్న వారంతా కూడా మోదీ సెటైర్ కు చప్పట్లు కొడుతూ నవ్వులు పూయించారు. మొత్తానికి అమెరికాలోనూ తగ్గేదేలే అన్నట్లు మోదీ పర్యటన కొనసాగుతున్నది.