27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Phone storage full : ఫోన్ స్టోరేజ్ నిండిపోతే..? ఎలా అనుకుంటున్నారా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

    Date:

    Phone storage full
    Phone storage full
    Phone storage full : సెల్ పట్టుకోలేని చేయి లేదంటే సందేహమే లేదు. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ప్లాట్ ఫారంలో ఉండనే ఉంటాం. ఎందులో లేకున్నా కనీసం రీల్స్ వీడియోస్ అయినా చూస్తుంటాం. ఇంత పెద్ద ప్రపంచం ఒక్క సెల్ ఫోత్ తోనే అరచేతిలో ఇమిడిపోయింది. వారి వారి అభిరుచికి తగ్గట్లు యాప్‌లు.. వాటితో నిత్యం గడపడం అలవాటుగా మారింది.

    నిత్యం వాడుతుంటాం కాబట్టి స్టోరేజ్ నిండిపోతుంది. ఈ సమస్య ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఇక వాట్సప్ తో స్టోరేజీ ఫుల్ అవ్వడం గురించి తెలుసుకుంటే.. వాట్సప్ లో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారు. వాటిలో అవసరం లేనివి చాలానే ఉంటాయి.

    వాట్సప్ యాప్‌లో ఒక సారి కంటెంట్ డౌన్ లోడ్ అనుమతి ఇచ్చిన తర్వాత ఆటోమాటిక్‌గా మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతూనే ఉంటాయి. ఫ్యామిలీ, ఆఫీస్‌తో పాటు ఫ్రెండ్స్ గ్రూపుల్లో అనేక మీడియా ఫైల్స్ ఉంటాయి. ఇన్ని ఉన్నా మీ ఫోన్ స్టోరేజీ నిండకుండా ఉండాలంటే.. వాట్సప్ కంటెంట్ ను డౌన్ లోడ్ చేయకుండా చూసుకోవాలి.

    స్టోరేజీని క్లీన్ చేసుకునేందుకు వీడియోలు, ఫొటోలను ఒక్కొక్కటిగా తొలగించాలి. ఇలా అయితే మీకు చాలా సమయం పడుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రతి చాట్ మీడియా, ఆటో-డౌన్‌లోడ్‌ నిలిపివేయడమే సరైన పరిష్కారం.

    వాట్సప్ మీకొక ఆప్షన్ ఇస్తుంది. కానీ, ఈ ఫీచర్‌ను వాడుకోవడం ద్వారా అవసరమైన కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా ఆటో‌డౌన్ లోడ్ కావు, ఇది గమనించుకోవాలి.

    మీకు వాట్సప్ లో మీడియా ఫైల్‌ వచ్చినప్పుడు.. యాప్ ఆటో మేటిక్‌గా ఫోన్ గ్యాలరీలో సేవ్ చేస్తుంది. మీడియా విజిబిలిటీ ఎంపిక ఆన్ అవుతుంది.

    ఈ ఫీచర్ ను ఆన్ లేదా ఆఫ్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసిన మీడియాను మాత్రమే ఇది ప్రభావితం చేస్తుంది. అంటే.. అయితే, ఇప్పటికే డౌన్‌లోడ్ చేసిన మీడియాకు వర్తించదు. ఫొటోలు, వీడియోల కోసం వాట్సాప్‌లో ఆటో డౌన్‌లోడ్‌ ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకుందాం..

    1. వాట్సప్ ఓపెన్ చేసి.. ఆటో డౌన్‌లోడ్‌ని నిలిపే ఏదైనా చాట్‌పై నొక్కండి.
    2. చాట్ పేరుపై ప్రెస్ చేయడం ద్వారా చాట్ ప్రొఫైల్ సెక్షన్‌కు వెళ్లండి.
    3. కిందికి స్క్రోల్ చేసి, మీడియా విజిబిలిటీపై నొక్కండి.
    4. ఆటో డౌన్‌లోడ్‌ నిలిపివేయడానికి ‘No’పై క్లిక్ చేయండి.

    అయితే, ఇక్కడ మీరు ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేయాలని అనుకున్నట్లయితే ఇదే విధానాన్ని అనుసరించి ‘No’ బటన్‌కు బదులుగా ‘Yes’ క్లిక్ చేయాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp : భార్య వాట్సాప్ కు కిస్ ఎమోజీ.. ఇద్దర్నీ నరికి చంపిన భర్త

    WhatsApp : కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఓ చిన్న విషయమే ప్రాణాంతక...

    WhatsApp : వాట్సాప్ (+91 95523 00009) ద్వారా ఏపీలో పౌరసేవలు.. త్వరపడండి

    WhatsApp Service in AP : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది,...

    Smart Phones : స్మార్ట్ ఫోన్ గ్యాస్ స్టవ్ దగ్గర పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త !

    Smart Phones : ప్రస్తుతం మొబైల్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి...

    WhatsApp : మీ వాట్సాప్‌ను ఎవరైనా సీక్రెట్‌గా వాడుతున్నారనే డౌట్ ఉందా? ఇలా  తెలుసుకోవచ్చు!

    WhatsApp :  ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల...