
Believe Jagan : వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు ఓటమి తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటు చేసిన రా.. కదలిరా బహిరంగ సభలో మాట్లాడుతూ బటన్ నొక్కి నగదు పంపితే అయిపోయినట్లు కాదు. ప్రజల్లోకి వెళితే నిజాలు తెలుస్తాయి. జగన్ ను నమ్ముకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.
వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే మేం వ్యతిరేకం కాదు. వైసీపీకి అనుకూలంగా ఉండటమే తగదని సూచించారు. వారికి రాజకీయాలొద్దు. పనులు సక్రమంగా చేయాలి. అలా చేస్తే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం. వాలంటీర్లకు రాజకీయాలు వద్దు. ప్రజల పనులు చేయడం మాత్రమే వారి విధి. అంతేకాని రాజకీయాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మా ప్రభుత్వం వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చారు. పేదరికాన్ని రూపుమాపడమే మా కర్తవ్యం. పేదల సంపద పెంచి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలుగు జాతి ఉన్నతికి కష్టపడి పని చేస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పారు. వైసీపీ విధానాలను ఎండగట్టి ప్రజలకు మరిన్ని సదుపాయాలు కల్పించడమే మా ఆశయంగా అభివర్ణించారు.
పరిశ్రమలు రాకుండా చేసి రాష్ట్రాన్ని తిరోగమనం అయ్యేలా చేశారు. ఒక్క రోడ్డు కూడా నిర్మించకుండా చోద్యం చూశారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు మేం రెడీగా ఉన్నాయి. జగన్ మాత్రం ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా తాత్సారం చేశారు. నిరుద్యోగులను పెంచారు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు.






