36.5 C
India
Friday, April 10, 2026
More

    తప్పు చేయకుంటే భయమెందుకు : సజ్జల

    Date:

    sajjala
    sajjala

    తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణను కొనసాగించడంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. దీనితో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇక మళ్లీ పట్టాలెక్కబోతోంది.

    తన ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారనేది చంద్రబాబుపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై విచారణ జరిపించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై స్టే మంజూరు చేసింది హైకోర్టు. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ ఉదయం తన ఆదేశాలను వెలువడించింది.

    దీనిపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. తమ ప్రభుత్వానికి దక్కిన భారీ విజయం అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావొచ్చు.. ఇంకెవరి ప్రభుత్వమైనా కావొచ్చు..విధాన పరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే అది ముమ్మాటికి తప్పే అవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

    గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన తప్పుడు నిర్ణయాలు, రాష్ట్రానికి కీడు కలిగించే చర్యలను ఆ తరువాత వచ్చిన సమీక్షించకపోవడం కూడా తప్పే అవుతుందని సజ్జల చెప్పారు. సమీక్షించడం అనేది- ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల కనీస బాధ్యతగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తే భయపడాల్సిన అవసరం వారికి లేదని సజ్జల అన్నారు.

    సిట్‌ను తాము ఏదో కక్షసాధింపు చర్యగా నియమించలేదని, అసెంబ్లీలో పూర్తిగా చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. చట్టసభలో చర్చించిన తరువాత తీసుకున్న నిర్ణయంపై టీడీపీ సవాల్ చేయడం అనేద దుస్సాహసమని, అక్కడే వారి భయం కనిపిస్తోందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం రాజధాని అమరావతి పరిధిలో చోటు చేసుకుందని, దీన్ని బయటపెట్టడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు దోహదపడతాయని అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...