
eat on time : ఈ రోజుల్లో ఆహారం తీసుకునే విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. కానీ సరైన సమయంలో తీసుకుంటే మంచిది. ఆహారం తినే సమయం కచ్చితంగా చూసుకోవాలి. లేదంటే జీర్ణ సంబంధమైన సమస్యలు రావడం ఖాయం. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే ఎసిడిటి, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.
సమయానుకూలంగా ఆహారం తీసుకోకపోతే సమస్యలు రావడం జరుగుతుంది. తిన్న ఆహారం కూడా జీర్ణం కాదు. దీంతో అనోరెక్సియా, బలిమియా, బింగీ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయని చెబుతున్నారు. అనోరెక్సియా వ్యాధి సోకిన వ్యక్తి బరువు దాదాపు 15 శాతం కోల్పోతాడు. మహిళల్లో రుతుక్రమం సరిగా రాదు.
బలిమియా, బింగి వ్యాధులు సోకడం వల్ల కూడా అధిక శ్రమ చేసిన భావన కలుగుతుంది. నీరసంగా అనిపిస్తుంది. బింగి వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి మాదిరే ఉంటాయి. ఆహారం జీర్ణం కాకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా సమయం ప్రకారం ఆహారం తినకపోతే ఏర్పడే దుష్ర్పభావాలు.
కొందరు అధిక బరువును తగ్గించుకోవాలని సమయ ప్రకారం అన్నం తినరు. దీంతో ఇంకా బరువు పెరిగే అవకాశాలుంటాయి. కడుపు ఎండబెడితే అనేక అనర్థాలు రావడం సహజం. అందుకే వేళకు తిండి తింటేనే మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ విషయం గమనించుకుని కడుపు నిండా తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి.