
Drink tea : మనకు ఆంగ్లేయులు చేసిన అలవాట్లలో టీ ఒకటి. దాంతో ఏ మాత్రం లాభం లేక పోయినా దాన్ని తాగనిదే ఎవరు ఉండటం లేదు. మనకు ప్రయోజనం లేకపో యినా నిద్ర లేచిన వెంటనే తాగుతున్నారు. ఫలితంగా మనకు కొన్ని అనారోగ్యాలను కూడా తెచ్చుకుంటున్నాం. కానీ టీ తాగే అలవాటును మాత్రం మానడం లేదు. దీంతో పలు రకాల జబ్బులు సైతం పొంచి ఉన్నాయి.
ఖాళీ కడుపున టీ తాగడం వల్ల మన పండ్లలో ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. ఏం తినకుండా టీ తాగడం అంత మంచి అలవాటు కాదు. ఉదయం టిఫిన్ చేశాక టీ తాగితే అదో లెక్క. కానీ ఏం తినకుండానే టీ తాగడం వల్ల మన ఒంట్లో కొన్ని భాగాలకు ఇబ్బంది కలుగుతుంది. టీ తాగడం వల్ల ఒక శాతం కూడా బలం లేదు. ప్రొటీన్లు లేవు. మినరల్స్ అందవు.
టీలో ఉండేది కెఫిన్. ఇది మన మెదడును చురుకుగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే కొందరికి టీ తాగిన తరువాత ఐడియాలు వస్తుంటాయి. అందులో ఉండే మహత్యం అదే. కానీ టీ తాగడం దురలవాటే. మద్యం తాగిన దానితో సమానమే. దానికి దీనికి తేడా ఏంటి? అది సాయంత్రం తాగితే ఇది పొద్దున్నే తాగుతుంటారు. ఇలా టీ తాగడం దురలవాటుగానే చెబుతారు.
ఎవరో చేసిన పాపానికి ఎవరికో శిక్ష పడినట్లు టీ మన దేశంలో పుట్టింది కాదు. ఆ మాటకొస్తే అమెరికాలో టీ తాగరు. వారికి ఉన్న మంచి అలవాటు. కానీ మనం టీకి ఆకర్షితులమైపోయాం. కొందరికి టీ తాగనిదే దినచర్య మొదలు కాదంటే అతిశయోక్తి కాదు. అంతలా మన జీవితంతో పెనవేసుకుపోయిన టీని దూరం చేసుకుంటేనే మంచిది. లేదంటే దుష్ఫలితాలే వస్తాయి.