
kidneys : మన శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రక్తాన్ని వడకట్టి ఇబ్బందులు లేకుండా చేయడంలో సహకరిస్తాయి. మన శరీరంలో ఐదు లీటర్ల రక్తాన్ని ప్రతి గంటకోసారి ఫిల్టర్ చేస్తాయి. కిడ్నీల పనితీరు మందగిస్తే డయాలసిసే శరణ్యం. దీంతో కిడ్నీలను పాడు కాకుండా చూసుకోవాలి. రోజు తగినన్ని నీళ్లు తాగాలి. దీని వల్ల వాటి పనితీరు బాగుంటుంది.
ఆయుర్వేదంలో చాలా చిట్కాలు ఉన్నాయి. పసుపు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తాయి. కిడ్నీలకు ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తాయి. దీంతో పసుపును ఎక్కువగా వాడుకుని కిడ్నీ జబ్బులు రాకుండా చేసుకోవాలి.
అల్లం కూడా కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కిడ్నీల వాపును తగ్గిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే అల్లం టీ తాగడం మంచిది. తిప్పతీగ కూడా కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలతో కిడ్నీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
త్రిఫల చూర్ణం (తానికాయ, కరక్కాయ, ఉసిరి) కూడా కిడ్నీల పనితీరును బాగు చేస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే త్రిఫల చూర్ణం సాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు కిడ్నీలకు మేలు చేస్తుంది. దీని వల్ల కిడ్నీల పనితీరు ప్రోత్సాహకరంగా ఉంచుతుంది. ఇలా కిడ్నీల పనితీరును బాగు చేయడానికి ఇవి ఎంతో కీలకం కానున్నాయి.