
Health will suffer : ఇటీవల కాలంలో ఆరోగ్యం గురించి అందరు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏదిపడితే అది తింటే ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన తిండి తినేందుకు ముందుకొస్తున్నారు. చెత్త తిండి తింటే ఫలితాలు కూడా అదే రకంగా ఉంటాయి. అందుకే మంచి తిండి తినాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎన్నో రకాల జాగ్ర్తత్తలు తీసుకుంటున్నాం.
బాగా ఉడికిన ఆహారాన్ని తీసుకోవాలి. ఉడకని అన్నం తింటే నష్టమే. వండిన ఆహారం సరిగా ఉడకకపోతే జీర్ణం కాదు. అందులో బ్యాడ్ బ్యాక్టీరియా తిష్టవేసుకుంటుంది. దీంతో చాలా నష్టం జరుగుతుంది. అందుకే వీలైనంత వరకు ఉడికిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది.
తిన్న వెంటనే పళ్లు తోముకోవడం మంచిది కాదు. పుల్లటి పదార్థాలు తిన్న వెంటనే పళ్లు తోముకుంటే ఇబ్బందులు వస్తాయి. పుల్లటి పదార్థాలు తిన్న వెంటనే పళ్లు తోముకుంటే వాటి మీద ఉండే ఎనామిల్ దెబ్బ తింటుంది. తిన్న తరువాత ఓ ముప్పైనిమిషాలు విరామం ఇచ్చి పళ్లు తోముకుంటే సరి.
బిగుతుగా ఉండే దుస్తులు ధరించకూడదు. ఇలా చేస్తే దురద, చెమట ఇబ్బంది పెడతాయి. జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి. కడుపులో నొప్పి, పేగులపై ఒత్తిడి కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను నెమ్మదిస్తాయి. ఇన్ఫెక్షన్, నరాల నొప్పికి దారి తీస్తుంది. ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కనుకే వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.