Jyothishya Sastram మన అరచేతి మీద ఉండే గీతలే మన లక్ ను నిర్ణయిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో హస్త సాముద్రికం ప్రకారం మన జాతకం తెలిసిపోతుంది. మన చేతిలో ఉండే గీతలతో మనకు లక్ కలిసొస్తుందా? లేదా అనేది తెలుస్తుంది. పుట్టుకతోనే కొందరికి కలిసొస్తుంది. మరికొందరికి ఏదీ కోరుకోకుండానే అన్ని దగ్గరకొస్తాయి. మనం బాగా డబ్బు సంపాదించాలంటే మన లక్ తో పాటు మన చేతిలో గీతలు కూడా అనుకూలంగా ఉండాలి. అప్పుడే మనకు అనుకున్నది దొరుకుతుంది.
అరచేతిలో ఉండే గుర్తులే ధనవంతులుగా చేస్తాయి. ఇంకా జీవితంలో విజయాలు అందుకునేలా సహకరిస్తాయి. కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదిగేందుకు కారణాలుగా నిలుస్తాయి. మనిషి అరచేతిలోని రేఖలు మన లక్ ను మారుస్తాయి. మీ చేతిలో మీనరేఖ ఉంటే అద్భుతంగా కలిసొస్తుంది. హస్త సాముద్రికంలో చేప గుర్తు మన చేతిలో ఉంటే అన్ని మంచి ఫలితాలు వస్తాయి.
చంద్ర స్థానంలో మీన రేఖ ఉంటే ప్రేమ కలవారవుతారు. శుక్ర స్థానంలో ఉంటే మంచి భార్య దొరుకుతుంది. గురు స్థానంలో ఉంటే మంచి విద్య దక్కుతుంది. కుజ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగం లభిస్తుంది. బుధ స్థానంలో ఉంటే వ్యాపారంలో లాభాలొస్తాయి. మన అరచేతిలో మీన రేఖ ఉండటం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
అరచేతిలో మీన రేఖ కలిగి ఉన్న వారు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. ఈ గుర్తు ఉన్న వారు జీవితంలో రాణిస్తారు. అన్నింట్లో విజయం సాధిస్తారు. హస్త సాముద్రికం ప్రకారం మన చేతిలోని రేఖలు మనకు లక్ వరించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ నేపథ్యంలో మన చేతిలో ఉండే రేఖలే మనకు మంచి ఫలితాలు వచ్చేలా చేస్తాయి.