Baby : యూ ట్యూబర్ నుంచి ‘బేబీ’ సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసిన క్యూటీ, బ్యూటీ వైష్ణవి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆనంద్ దేవరకొండతో కలిసి చేసిన బేబీ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది.
సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ‘మాస్ మూవీ మేకర్స్’ పతాకంపై SKN నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకున్న మూవీకి సంబంధించి ప్రస్తుతం సక్సెస్ మీట్లు నడుస్తున్నాయి.
సినిమా సక్సెస్ తర్వాత టీం ఇంటర్వ్యూలలో తెగ ముచ్చటిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా చేసిన వైష్ణవి తన రొమాంటిక్ సీన్స్, పడకగది సీన్స్ గురించి చెప్పుకచ్చింది. దర్శకుడు తన పాత్ర గురించి, క్యారెక్టర్‌కు సంబంధించిన బెడ్ రూం సన్నివేశాల గురించి చెప్పినప్పుడు భయం వేసింది. గతంలో యూట్యూబ్ లో ఈ సీన్స్ లలో నటించలేదు. ఒక వేల నటించాల్సి వస్తే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉండేవారు. కానీ మూవీ కాబట్టి సెట్‌లో చాలా మంది ఉన్నారు. వారి ఎదురుగా ఎలా చేయాలి. సరే చేసినా తన యూట్యూబ్ ఫ్యాన్స్ ఎలా స్వీకరిస్తారోనని విపరీతంగా టెన్షన్ పడ్డా అని వైష్ణవి చైతన్య చెప్పింది. ఆ భయంతోనే సినిమా చేయనని చెప్పానని చెప్పింది.
కానీ, దర్శకుడు సాయి రాజేశ్ కథానాయిక స్వభావం, ఆమె తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను వివరంగా చెప్పడంతో ధైర్యం వచ్చింది. ఇలాంటి సీన్ చేస్తానని తల్లిదండ్రులకు ముందే చెప్పాను, వారు ఒప్పుకున్నారు కాబట్టే ఆ సీన్స్ కు సిద్ధమయ్యా. ఆ సీన్స్‌లో నటించేప్పుడు టీమ్ తనకు చాలా కంఫర్టబుల్‌గా ఉందని చెప్పింది. లిప్ లాక్ సీన్, రొమాంటిక్ సీన్‌లలో నటిస్తున్నప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారని వెల్లడించింది.