
After Eating : ఈ రోజుల్లో షుగర్ సాధారణంగా మారింది. ప్రతి ఒక్కరిలో షుగర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో వారు ఇక జీవితాంతం మందులు మింగాల్సిందే. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మనం అవేమీ పాటించం. పట్టించుకోం. దీంతో డయాబెటిస్ మనల్ని వేధింపులకు గురిచేస్తుంది. షుగర్ కే రాజధానులుగా ఇండియా, చైనా నిలుస్తున్నాయి. మనం ఎక్కువగా అన్నం తినడం వల్లే ఈ వ్యాధి వస్తోంది. దీనికి మనం కొన్నిపరిహారాలు చేస్తే తగ్గుతుంది.
రోజు సాయంత్రం తిన్నాక ఓ అరగంట పాటు నడిస్తే ఎంతో ప్రయోజనం. దీన్ని క్రమం తప్పకుండా చేస్తే ఉపశమనం లభిస్తుంది. షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. ఇది పరిశోధన ద్వారా గుర్తించారు. అందుకే రాత్రి భోజనం చేశాక ఓ అరగంట పాటు నడిచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. అలా చేయడం వల్ల మన రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని చెబుతున్నారు.
ఉదయం పూట నడిచిన దానికంటే సాయంత్రం తిన్న తరువాత నడిచే నడకకే ఎక్కువ లాభం ఉందట. దీంతో మనం సాయంత్రం భోజనం చేశాక బద్ధకం అనుకోకుండా రోజు అరగంట పాటు నడవడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే నడక మంచిదే. రాత్రి పూట తిన్నాక అరగంట నడిచి మన షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
దీన్ని అందరు విధిగా పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గించుకునే క్రమంలో మనం ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే రోజు సాయంత్రం ఓ అరగంట నడిస్తే పోయేదేముంది షుగర్ తప్ప. ఇలా మనం సింపుల్ చిట్కాలు ఉపయోగించుకుని షుగర్ ను నియంత్రణలో ఉంచుకుంటే మనకే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.