35.9 C
India
Monday, May 12, 2025
More

    Ammaku Vandanam : ‘అమ్మకు వందనం’ కావాలంటే రావాల్సిందే..

    Date:

    Ammaku Vandanam
    Chandra Babu

    Ammaku Vandanam : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే పింఛన్ మొత్తం  పెంచి లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ క్రమంలో మెగా డీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. అన్న క్యాంటీన్లు ఏర్పాుట చేసేందుకూ ముందుకు సాగుతున్నది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హామీకి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు అందించే స్టూడెంట్ కిట్‌కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు.

    కొత్త ప్రభుత్వంలో పథకాల (తల్లికి వందనం, స్టూడెంట్ కిట్‌) పేర్లలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌  వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. . ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం  అమ్మకు వందనం పేరిట ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే స్టూడెంట్ కిట్ కూడా పంపిణీ చేసింది. అయితే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్‌ పథకాలకు పొందడానికి తప్పనిసరిగా ఆధార్‌ కలిగి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తూ వెసులుబాటు కల్పించింది.  విద్యార్థులు ఆధార్‌ నమోదు చేసుకునేందుకు విద్యాశాఖ ద్వారా అవకాశం కల్పించాలని  ప్రభుత్వం సూచించింది.

    అయితే ఆధార్‌ వచ్చే దాకా 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్‌ వచ్చే దాకా ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్సు, ఉపాధి పథకం కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రాలను అనుమతిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు అమ్మకు వందనం పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. స్టూడెంట్‌ కిట్‌ కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్స్, ఇంగ్లిష్ డిక్షనరీ, మూడు జతల యూనిఫామ్స్, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు అందిస్తారు.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...

    Chandrababu : బిల్ గేట్స్ తో చంద్రబాబు కీలక భేటి

    Chandrababu : దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్...

    Chandrababu : అలెర్ట్ అయిన చంద్రబాబు.. ముప్పు రాకముందే?

    Chandrababu : ఢిల్లీలో జరుగుతున్నపరిణామాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. అనుభవమున్న...