IIMA Alumni Association : అమెరికాలోని న్యూయార్క్ లో ఐఐఎంఏ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5న సాయంత్రం 5నుంచి రాత్రి 9గంటల వరకు అట్టహాసంగా నిర్వహించారు. ఇందుకు కాన్స్ లేట్ జనరల్ ఆఫ్ ఇండియా వేదికైంది. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.
‘వ్యాపారంలో అమెరికా భారత్ ల భాగస్వామ్యం’ థీమ్ తో ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ చైర్మన్ డా. ముఖేష్ అగ్ని, డిస్కవర్ కార్డ్‌లు, మాస్టర్ కార్డ్ సంస్థల అధినేత హరిత్ తల్వార్, ఇన్నోయాకర్ సహ వ్యవస్థాపకులు సందీప్ గుప్త, ఐఐఎంఏ ఎండోమెంట్ ఫండ్ సీఈవో గౌరవ్ రస్తోగి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశేష అతిథిగా యు బ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు ఎలమంచిలి గారు పాల్గొన్నారు. అతిథిలతో కలిసి సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా యు బ్లడ్ డైరీ లను కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అందజేశారు.
తాము బాగుంటే చాలనుకునే ప్రస్తుత సమాజంలో ఇతరుల బాగు కోసం తప్పించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి యూ బ్లడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలిమంచిలి గారు. తన ఫ్యామిలీ కంటే కూడా సమాజమే ముందని భావిస్తారాయన. సరైన సమయంలో రక్తం అందకుండా మరణించిన ఎంతో మంది గాధలను తెలుసుకున్న ఆయన యూ బ్లడ్ యాప్ కు మార్గం వేశారు. యూబ్లడ్ దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ మూలన వెళ్లినా పని చేస్తుంది. యు బ్లడ్ తరఫున డాక్టర్ జై జగదీష్ బాబు చేస్తున్న సేవలను వారు కార్యక్రమానికి వచ్చిన అతిథులు కొనియాడారు.
యూ బ్లడ్ అంటే..
మానవ శరీరంలో అత్యంత కీలక భూమిక పోషించేది రక్తమే. శరీరంలోని అన్ని అవయవాలకు పోషక పదార్థాలు, ఆక్సిజన్ తీసుకెళ్లేది రక్తమే. అలాంటి రక్తాన్ని ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించలేదు. రక్తం దానం చేస్తే మరో వ్యక్తికి జీవితాన్ని ఇచ్చినట్టే అవుతుంది. అందుకే ‘రక్తదానం మహాదానం’ అన్నారు మన పెద్దలు. సరైన సమయంలో రక్తం లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలను వదులుతున్నారు. కీలకమైన ఆపరేషన్లు చేస్తున్న సమయంలో కూడా రక్తం చాలా అవసరం ఇంత అవసరమైన రక్తాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయడం చాలా కష్టం మూడు నెలల కంటే దాదాపుగా ఎక్కువ నిల్వ చేయలేం. దీని కన్నా లైవ్ బ్లడ్ చాలా మేలని చాలా సందర్భంగాల్లో డాక్టర్లు చెబుతూనే ఉంటారు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు తన వంతుగా ఈ విషయంలో సమాజానికి ఏదైనా చేయాలని తలిచారు. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే ‘యూ బ్లడ్’ యాప్. ఆయన తండ్రి కోరిక మేరకు ఎన్నో రోజులు కష్టపడి ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చారు. దీని ద్వారా సరైన సమయంలో గ్రహీతకు లైవ్ బ్లడ్ అందుతుంది. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకుంటే సమీపంలోని గ్రహీతకు మెసేజ్ వెళ్తుంది. అంటే దాత వెంటనే హాస్పిటల్ లేదా రక్తదాన కేంద్రానికి వచ్చి లైవ్ లో రక్తం ఇవ్వచ్చు. ఇలాంటి యాప్ వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించేందుకు వీలు కలుగుతుంది.
న్యూయార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ యలమంచిలి గారు, యూబ్లడ్ టీం రమేష్ రాయల, సుశీల్ భాటియా పాల్గొన్నారు.