
Ileana Baby Bump Photos : ఇలియానా.. గోవా బ్యూటీ త్వరలోనే తల్లి కాబోతుంది అనే విషయం ఈ మధ్యనే అందరికి చెప్పింది.. ఈ విషయం విన్నవారంతా నోరెళ్లబెట్టిన సంగతి తెలిసిందే.. గత నెలలో ఈ హాట్ బ్యూటీ ప్రెగ్నెన్సీ అని ప్రకటించింది.. ఆ తర్వాత సైలెన్స్ గా ఉంది.. దీంతో ఈమె నిజంగానే ప్రెగ్నెంట్ అవునో కాదో అనే కన్ఫ్యూజన్ లో అందరు పడ్డారు..
మరి ఎట్టకేలకు తాజాగా ఈమె బేబీ బంప్ తో ఉన్న లేటెస్ట్ పిక్ ను రివీల్ చేసింది.. ఏప్రిల్ లోనే బిడ్డకు వెల్కమ్ చెబుతూ ప్రెగ్నెన్సీ అంటూ పోస్ట్ చేసింది.. ఆ తర్వాత మరేమీ వివరాలు ప్రకటించలేదు.. కానీ సడెన్ గా ఇప్పుడు బేబీ బంప్ తో దర్శనం ఇచ్చి స్వీట్ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి..
ఇన్ని రోజుల తర్వాత తన బేబీ బంప్ రూపాన్ని పూర్తిగా చూపించడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యంతో పాటు షాక్ కూడా అవుతున్నారు.. మరి ఈమె పోస్ట్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ను హైలెట్ చేస్తూ దిగిన ఈ ఫోటోలకు అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. అయితే ఈమె గర్భానికి కారణం ఎవరో మాత్రం ఈమె ఇంకా రివీల్ చెయ్యలేదు..
నెటిజెన్స్ కూడా ఇదే విషయాన్నీ అడుగుతూ తండ్రి ఎవరో చెప్పమంటూ కామెంట్స్ చేస్తున్నారు.. బాలీవుడ్ లో వస్తున్న రూమర్స్ ప్రకారం కత్రినా కైఫ్ బ్రదర్ తో ఈమె డేటింగ్ చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయనే అయిఉంటాడు అని చాలా మంది భావిస్తున్నారు.. అసలు విషయం ఈమె చెబితే కానీ తెలియదు..
View this post on Instagram