TTD : భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన టిటిడి పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి ఆలయాల అభివృద్ధి పనుల కోసం శ్రీ వాణి ట్రస్ట్ నిధులు వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సిమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
టిటిడి కళాశాలలో హాస్టల్ గదుల కొరత లేకుండా నిర్మించాలని నిర్ణయం
తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో 10 లిప్టిల ఏర్పాటు 1.88 కోట్లు కేటాయించారు.