26.9 C
India
Friday, January 23, 2026
More

    England Vs Scotland : కాసేపట్లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య కీలక పోరు 

    Date:

    England Vs Scotland
    England Vs Scotland

    England Vs Scotland : ఇంగ్లండ్, స్కాట్లండ్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు టీ20 ప్రపంచకప్ లో విజయం సాధించిన ఇంగ్లండ్ ఈ సారి కూడా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. 2010, 2022 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో గెలిచి ఇంగ్లీష్ టీం సత్తా చాటుకుంది. ఇంగ్లండ్ టీం ఈసారి టైటిల్ రేసులో ఉంది. పిల్ సాల్ట్, లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, మొయిన్ అలీ, సామ్ కరన్, ఇలా అనేక మంది స్టార్లతో కప్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది.

    స్కాట్లాండ్ టీం ఇంగ్లండ్ తోొ మొదటి సారి టీ 20 మ్యాచ్ ఆడనుంది. స్కాట్లాండ్ మొదటి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వార్మప్ మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ చేతిలో స్కాట్లాండ్ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. కరేబియన్ దీవుల్లో స్కాట్లాండ్ ఆడనున్న మొదటి మ్యాచ్ కావడంతో పిచ్ ఎలా ఉంటుందో ఏ విధంగా స్పందిస్తుందో ఇంకా టీం అంచనాకు రాలేకపోతుంది. స్కాట్లాండ్ మాత్రం స్పిన్ విభాగంపైనే ఆధారపడి ఉంది.

    లివింగ్ స్టోన్, సామ్ కరన్, పిల్ సాల్ట్, బెయిర్ స్టో లు స్పిన్ ఆడటంలో వెనుకంజలో ఉన్నారు. దీంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడానికి స్పిన్ ను ఉపయోగించుకోవచ్చని చూస్తోంది. స్కాట్లాండ్ గత 17 మ్యాచుల్లో  10 గెలిచింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోప్రా ఆర్చర్ జట్టులోకి పునరాగమనం చేయడంతో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది.

    ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. మాపై ఎలాంటి ప్రెజర్ లేదని ఈ టోర్నమెంట్ మొత్తం సాఫీగా సాగిపోతుందని ఆశిస్తున్నామని చెప్పాడు. వరల్డ్ కప్ కు ముందు పాకిస్థాన్ తో టీ 20 సిరీస్ లో 2-0తో గెలవడం కూడా ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసానికి కారణమైంది. అయినా స్కాట్లాండ్ ను తక్కువ అంచనా వేయలేమని ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ అన్నాడు. బార్బడోస్ లోని కెన్నింగ్ టౌన్ లో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohit Sharma : రోహిత్ శర్మ ఆ పని చేయకుంటే.. ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచేదే కాదు

    Rohit Sharma : రోహిత్ శర్మ సారథ్యంలో 2024 టీ 20...

    India Vs Zimbabwe : కుర్రాళ్లకు పరీక్ష.. జింబాబ్వేతో ఆడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

    India Vs Zimbabwe : టీ-20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని...

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...