27.8 C
India
Wednesday, February 18, 2026
More

    RGV – Kalki : ‘కల్కి’లో చింటూగా ఆర్జీవీ చింపేశాడుగా!

    Date:

    RGV - Kalki
    RGV – Kalki

    RGV – Kalki :  తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన హీరో ప్రభాస్. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లోనే చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటించారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమాను దాదాపు 600కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చారు.

    ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను టైం ట్రావెల్ కథతో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించినట్లు ముందుగానే తెలిసింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే డైరెక్టర్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో విజువల్ వండర్ గా తెరకెక్కించారు.   ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500లకు పైగా థియేటర్లలో నేడు విడుదల అయింది. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కోలాహలం నెలకొంది.

    ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయ్యాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. అందుకు తగ్గట్లుగానే టాక్ కూడా పాజిటివ్‌గానే వచ్చింది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయన్న టాక్ వస్తోంది.  ముఖ్యంగా ఇందులో చాలా మంది స్టార్లను కూడా భాగం చేశారు. కొందరు సినీ ప్రముఖులను అతిథి పాత్రల్లో చూపించారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో సంచలన దర్శకుడు ఆర్జీవీ కూడా ఉన్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో రాంగోపాల్ వర్మ పాత్ర వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఇందులో ఆయన ఓ బిజినెస్ డీలర్‌గా కనిపించాడు. అంతేకాదు, ప్రభాస్‌కే షాకిచ్చేలా తనదైన డైలాగులతో మెప్పించాడు. ఇక, స్క్రీన్‌పై ఆయన కనిపించగానే థియేటర్లు అన్నీ దద్దరిల్లిపోయేలా ప్రేక్షకులు కేకలు వేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani ఫొటో స్టోరీ.. టూ పీస్ లో దిశా పటానీ

    Disha Patani : టోన్డ్ ఫిజిక్, షైనింగ్ బాడీకి ప్రసిద్ధి చెందిన...

    Deepika delivery date: దీపికా పదుకొనె డెలివరీ డేట్ ఇదే.. కన్ఫమ్ చేసిన వైద్యులు.. ఎప్పుడంటే?

    Deepika delivery date: దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది....

    Kalki : కల్కి నుంచి మరో అప్ డేట్.. స్ట్రీమింగ్ డేట్ లాక్

    Kalki : ఇండియన్ సినిమా కీర్తిని ప్రపంచానికి చెప్పింది కల్కి 2898ఏడీ....