25.9 C
India
Monday, December 15, 2025
More

    Operation Meghdoot : మైనస్ 50 డిగ్రీల చలిలో.. వామ్మో తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పోడుతుంది.. ఆఫరేషన్ మేఘదూత్ వివరాలివే..

    Date:

    Operation Meghdoot
    Operation Meghdoot

    Operation Meghdoot : సియాచిన్ గ్లేసియర్ లో మన సైనికులు దాదాపు మైనస్ 50 డిగ్రీల చలిలో కూడా కాపలా కాస్తూ శత్రుదేశం దాడులు చేయకుండా వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశం కోసం సేవ చేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రంలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. శత్రు దేశాల బుల్లెట్ల కంటే ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులే అక్కడ సవాల్ విసురుతాయి.

    మంచు తుపాన్లు, హిమనీ నదాలు ఉన్న స్థలం అయిన ఈ ప్రాంతం ఒకప్పుడు జమ్మూ కశ్మీర్ కు చెందినది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం అయిన లద్దాఖ్ లో అంతర్భాగంగా మారింది. టిబెట్ భాషలో ’ బాల్టీ‘ లో సియాచిన్ అంటే గులాబీ వనం అని అంటుంటారు. పాక్ చేసిన దురాగతాలను మేఘదూత్ ద్వారా అడ్డుకుంది. గ్లేసియర్ పై కన్నెత్తి చూడకుండా చేయగలిగింది. 15 వేల అడుగుల ఎత్తులో పాక్ కుయుక్తులను తిప్పికొట్టింది.
    1949లో ఇండియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన కరాచీ ఒప్పందంలో రెండు దేశాలకు లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ)ను సరిహద్దుగా నిర్ణయించుకున్నాయి. దాదాపు  23 వేల అడుగుల ఎత్తులో దాదాపు 75 కిలో మీటర్ల నుంచి సియాచిన్ గ్లేసియర్ ఉంటుంది.  సియాచిన్ వెళ్లేందుకు పాక్ ఆర్మీ వారి కోసం జర్మనీ నుంచి ప్రత్యేక దుస్తులను తెప్పించి పంపించేందుకు ప్రయత్నాాలు చేసింది. ఇది తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ వెంటనే వారి కంటే ముందుగా తమ మిత్ర దేశమైన ఫ్రాన్స్ నుంచి సియాచిన్ లో ఉండగలిగేలా దుస్తులను తెప్పించి మన సైనికులను అక్కడికి పంపి మన ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు.

    ముందుగా తెలుసుకున్న గూడచార సమాచార వ్యవస్థ ప్రకారం.. ఇది సాధ్యమైందన్నది నిజం 2003 లో వాస్తవ మైదాన స్థాన రేఖ వద్ద రెండు దేశాలకు చెందిన స్థావరాలు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2000 మంది సైనికులు అక్కడ మరణించారని అంచనా..  వీరంతా ఎక్కువ మంది కాల్పుల్లో మరణించిన వారు కాదు. అక్కడ ప్రతికూల వాతావరణంలో జీవించలేక.. చనిపోయిన వారే ఎక్కువగా ఉంటారు.
    ఆపరేషన్ మేఘ్‌దూత్ 1984 ఏప్రిల్‌ 13న ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌ ప్రారంభించారు.  అప్పట్లో హై ఆల్టిట్యూడ్‌ వెల్ఫేర్‌ స్కూల్‌కి కమాండంట్‌గా ఉన్న కల్నల్‌ నరీందర్‌ “బుల్‌’ కుమార్‌ తన బృందంతో పర్వతారోహణం చేశారు.  భారత సైన్యం 18 వేల అడుగుల ఎత్తులో బిలాఫోండ్‌ లా ప్రాంతంలో భారత జెండాను రెపరెపలాడించింది. లెఫ్టనెంట్‌ కల్నల్‌ సలారియా నేతృత్వంలో ఏడుగురు ఆఫీసర్లు, 13 జెసీవోలు, 175 మంది జవాన్లు 40 కేజీల బరువు మోస్తూనే రోజుకి 10 కి.మీ నడక  సాగించి జయకేతం ఎగురవేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Army Welfare : ఆర్మీ వెల్ఫేర్ ఫండ్: వాస్తవం ఏమిటి? వైరల్ అవుతున్న సందేశాలపై స్పష్టత

    Army Welfare : సోషల్ మీడియాలో భారత సైన్యం కోసం విరాళాలకు సంబంధించి...

    Pakistan : పాకిస్తానీలకు భారత్‌లో నేడే డెడ్‌లైన్: ఏం జరుగుతోంది?

    Pakistan : దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీ పౌరులకు నేడు కీలకమైన రోజు. కేంద్ర...

    Prime Minister Modi : టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

    Prime Minister Modi : జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై...

    Pahelgam attack : పహెల్గామ్ దాడి: ఐబీ అధికారి, వైజాగ్ వాసి దుర్మరణం

    Pahelgam attack : కాశ్మీర్‌లోని పహెల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో దేశం దిగ్భ్రాంతికి...