Bigg Boss Inaya : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో డ్యాన్స్ చేసి ఫేమస్ అయిన ఇనాయ సుల్తానా బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
ఇనయ తన సోషల్ మీడియాలో బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన రొమాంటిక్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇనయ బాయ్ ఫ్రెండ్ పేరు గౌతమ్ కొప్పిశెట్టి. జిమ్, యోగా శిక్షకుడి చాలా పేరుపొందారు. సెలబ్రిటీలకు పర్సనల్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. కొన్ని నెలలుగా ఇనయాతో బాగా క్లోజ్ గా ఉంటున్నాడు. బెడ్రూంలో వారిద్దరూ అర్ధనగ్నంగా అద్దం ముందు నిల్చొని ఫొటోలు షేర్ చేస్తున్నారంటే వారెంత సన్నిహితంగా మెలుగుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి ఇనయ చేసిన డ్యాన్స్ వైరల్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ లోకి వెళ్లి బోల్డ్ లేడీగా పేరు తెచ్చుకుంది.
మరోసారి ప్రియుడితో దిగిన రొమాంటిక్ ఫొటోలన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఎర్రటి స్కర్ట్ లో ఉన్న ఇనయాను బాయ్ ఫ్రెండ్ గౌతమ్ బీచ్ లో ఎత్తుకొని ఉండగా ఆమె ఆనందంతో పరవశించిపోతున్నది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు లవ్లీ అండ్ రోమాంటిక్ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ బాయ్ ఫ్రెండ్ తో బంధం పెళ్లి దాకా వెళ్తుందా.. లేక రొమాన్స్ తోనే ఆగిపోతుందో వేచి చూడాల్సిందే.