32.7 C
India
Monday, February 26, 2024
More

  Lakshadweep : లక్షద్వీప్ కు పెరుగుతున్న టూరిస్ట్ లు.. ఎలా వెళ్లాలి? అక్కడి వసతుల గురించి తెలుసా?

  Date:

  Lakshadweep
  Lakshadweep

  Lakshadweep : భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ ను సందర్శించి అత్యంత సుందర ప్రాంతమని, పర్యాటకానికి చాలా అనుకూలతలు ఉన్నాయని ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీనికి మాల్దీవుల మంత్రులు మోడీపై నోరు పారేసుకున్నారు. ఇంకే ముంది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ కుదేలు.. మాతోనే మీకు ఆముదాని అంటూ సెలబ్రెటీలు సచిన్, అమితాబ్, సల్మాన్ తో పాటు వివిధ రంగాలకు చెందిన వారు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

  మా పర్యాటకంతోనే మీరు బతికేది అంటూ.. మా ప్రధానినే తిడతారా? మేము ఇక రాము అని చెప్పడంతో అక్కడి అధికారులు, వ్యాపారులు ప్రస్తుతం ఈగలు తోలుకుంటున్నారు. ఇప్పుడు అందరూ లక్షద్వీప్ కే పయనం అవుతున్నారు. ప్రధాని సూచనలను తాము పాటిస్తామని సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు లక్షద్వీప్ కు పయనం అవుతున్నారు. ఈ ఐలాండ్ చాలా అందంగా ఉంటుంది.

  లక్షద్వీప్ కు వెళ్లేందుకు కేవలం జల, వాయు మార్గాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ముందుగా కొచ్చిలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జల మార్గం గుండా వెళ్లాలంటే కేరళలోని కొచ్చి, విశాఖ ఓడ రేవు నుంచి వెళ్లవచ్చు. చార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ద్వీపం అందాలు చూస్తూ కాటేజీలలో ఉండవచ్చు. వాటికి ధర కూడా రీజనబుల్ గానే ఉంటుంది. సీఫుడ్ తో పాటు నాన్ వెజ్, వెజ్ అందుబటులో ఉంటాయి.

  ఇక చూడదగిన ప్రదేశాలు బోలెడు ఉన్నాయి. లక్షద్వీప్ 36 దీవుల సమూహం. కానీ ఇందులో 10 ప్రాంతాల్లో మాత్రమే జనాభా ఉంటుంది. కవరత్తి, అగత్తి, చెట్లత్, బిత్రా, కిల్టాన్, అందోహ్, కల్పేని, మినియాయ్ బిత్రా. ఒక్కో దీవిలో ఒక్కోటి స్పెషల్.. ఒక దీవిలో స్కైడైవింగ్, మరో దీవిలో పక్షులు, ఇంకో దీవిలో పామాయిల్ చెట్లు.. ఇలా ఏ దీవికి ఆ దీవి స్పెషల్. మోడీ వెళ్లడం.. మాల్దీవుల మంత్రుల కామెంట్లతో లక్షద్వీప్ కు కల వచ్చిందని టాక్ నడుస్తోంది. ఒక సారి అలా వెళ్లద్దాం అంటూ ప్రతీ ఒక్కరూ ఈ ట్రిప్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.

  Share post:

  More like this
  Related

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

  Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

  Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

  Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Lakshadweep : లక్ష్యద్వీప్ ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్ కేటాయింపు

  BUDGET 2024 - Lakshadweep : మాల్దీవుల వివాదం పెరిగిన వేళ...

  Lakshadweep : మాల్దీవులు కాదు లక్ష్యద్వీప్ లోనే షూటింగులు జరుపుకోండి

  Lakshadweep : మాల్దీవుల వ్యవహారం హాట్ హాట్ గా మారింది. అక్కడి...

  Lakshadweep : లక్షదీవులకు వెళ్లడం ఎలాగో తెలుసా? అంత సులువైన విషయం కాదు..

  Lakshadweep Tour : ప్రధాని మోడీ ఇటీవల లక్ష్యదీప్ వెళ్లారు. ‘సాహసాలను...