India Day Parade in NewJersy: అమెరికాలోని న్యూ జెర్సీలో ఇండియా డే పరేడ్ కార్యక్రమం ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనుంది. ఆగస్టు 13న ఆదివారం న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ లో ఇండియా డే పరేడ్ ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఇంకా ఒక్కరోజు సమయం ఉండటంతో ఆమె కోసం అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టారు.
కాగా స్టార్ హీరోయిన్ తమన్నా ఇటువంటి పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడం తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను ఇండియన్ బిజినెస్ అసోసియేషన్(IBA) తాజాగా విడుదల చేసింది. ఈ వేడుకలకు సంబంధించిన విశేషాలను తమన్నా వివరించారు.
ఇదిలా ఉంటే తమన్నా నటించిన ‘జైలర్’ మూవీ నిన్న విడుదల కాగా.. ‘భోళా శంకర్’ మూవీ నేడు విడుదలైంది. ఈ రెండు సినిమాలు పాజిటీవ్ సొంతం చేసుకోవడంపై మిల్కీ బ్యూటీ తమన్నా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమన్నా సినిమా షూటింగులతో బీజీగా ఉన్నప్పటికీ న్యూజెర్సీలోని ఇండియా పరేడ్ కార్యక్రమానికి హాజరుకానుండటంతో ప్రత్యేకంగా నిలువనుంది.