21.4 C
India
Sunday, January 18, 2026
More

    Modi : ప్రపంచానికి భారత్ బౌద్ధానిచ్చింది.. యుద్ధాన్ని కాదు: మోదీ

    Date:

    Modi
    Modi

    Modi : ప్రపంయానికి భారత దేశం బౌద్ధాన్నిచ్చిందని పీఎం మోదీ అన్నారు. ఆస్ట్రియాలో మోదీ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచానికి భారత్ బౌద్ధాన్ని ఇచ్చిందని.. యుద్దాన్ని కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఎప్పుడూ సర్వ మానవాళి శాంతి, సామరస్యాలే కోరుకుందని తెలిపారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వేల సంవత్సరాలుగా భారత్ తమ నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోందని గుర్తుచేశారు. తద్వారా యుద్ధానికి బదులు, శాంతి, సామరస్యాన్నిప్రచారం చేస్తోందని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత్ ను ‘విశ్వబంధు’గా చూస్తోందని.. అది మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.

    భారత్ తరహాలోనే ఆస్ట్రియా చరిత్ర, సంస్కృతి చాలా పురాతనమైనది, గొప్పదని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలు చరిత్రాత్మకమైనవని గుర్తు చేశారు. దీనివల్ల ఉభయ దేశాలూ లబ్ధి పొందాయన్నారు. సంస్కృతి, వాణిజ్యం.. అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతోందన్నారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు అక్కడి ప్రవాసులు ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో హోరెత్తించారు.

    అనంతరం రష్యా, ఆస్ట్రియా పర్యటనను ముగించుకునన మోదీ భారత్ కు బయలుదేరారు. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆస్ట్రియా ఛాన్స్ లర్ కార్ల్ నెహమ్మర్, అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండరర్ బెల్లెన్ తో ప్రధాని ఫలవంతమైన చర్చలు జరిపారు. వివిధ అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పరస్పరం నిర్ణయించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ప్రధాని మోదీతో సతీసమేతంగా మంత్రి నారా లోకేష్ భేటీ

    Nara Lokesh Meet PM Modi : ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

    Swami Sivananda : ప్రసిద్ధ యోగా గురువు స్వామి శివానంద కన్నుమూతపై ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగం

    Swami Sivananda : ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి...

    Bangladesh : నేను బంగ్లా దేశియున్ని…నా ఈక కూడా మీరు పీకలేరు..

    Bangladesh : "నేను బంగ్లా దేశియున్ని... నా ఈక కూడా మీరు పీకలేరు......

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...