India independence celebrations in America : భారత స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమవుతున్నది. ఆగస్టు 15న నిర్వహించే ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన దేశంతో పాటు విదేశాల్లోని భారతీయులు కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమెరికా, యూకే, ఆస్ర్టేలియా సహా మరికొన్ని దేశాల్లో కూడా భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఆయా దేశాల్లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే అమెరికాతో పాటు పలు దేశాల్లో కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని మేయర్ సామ్ జోషి, ది ఎడిసన్ టౌన్షిప్ కౌన్సిల్ కూడా భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఇప్పటికే ఏర్పా్ట్లు చేసింది. ఈ మేరకు స్థానిక భారతీయులకు ఆహ్వానాలు పంపింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేసింది. ఎడిసన్ టౌన్షిప్ లోని మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట ఈ వేడుకలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా భారత సంప్రదాయ రీతిలో పలు వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఎడిసన్ టౌన్షిప్ లో నిర్వహించే వేడుకలో పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరుకానున్నారు. ఈ మేరకు అందరూ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని అక్కడి కౌన్సిల్ ఆహ్వానాలు పంపింది. మంగళవారం నిర్వహించే ఈ వేడుకల్లో ఆర్య ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు కౌన్సిల్ ప్రకటించింది. భారతీయులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది.మున్సిపల్ కాంప్లెక్స్ ఎదుట కు కౌన్సిల్ ఈ సందర్భంగా తరలిరావాలని పేర్కొంది.