34.8 C
India
Tuesday, April 23, 2024
More

    హైదరాబాద్ వేదికగా భారత్ -పాక్ వరల్డ్ కప్  మ్యాచ్.. కానీ?

    Date:

    world cup
    world cup
    India Pak World Cup match at Hyderabad : క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇదో గుడ్ న్యూస్. ప్రపంచకప్ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం నిర్ణయం ఖారారైంది. 15-అక్టోబర్, 2023 నుండి 19-నవంబర్, 2023 వరకు వరల్డ్ కప్ జరగనుంది. అయితే ఇందులో పాకిస్తాన్ పాల్గొంటుందా.. అంటూ కొన్ని రోజులుగా చర్చలు జరిగాయి. తాజాగా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంది పాక్ బోర్డ్ ప్రపంచ కప్ భారత్ లో ఐనా పాక్ పాల్గొంటుంది అంటూ ఖరారు చేసింది. అయితే పాక్ తో భారత్ ఆడే మ్యాచ్ లకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ పోటీ కొనసాగించాలని నిర్ణయించారు.

    క్రికెట్ ప్రపంచ కప్ కు ఈ సారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అందు కోసం పాకిస్తాన్ టీం అక్టోబర్ లో భారత్ కు వస్తుంది. గత ఆసియా కప్ లో విభేదాలు తలెత్తడంతో భారత్ కు రాబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పింది. దీనిపై కొంత కాలంగా ఆ బోర్డు తర్జన భర్జనలు పడింది. వరల్డ్ కప్ కావడంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ముందస్తుగా అందిన సమాచారం ప్రకారం 5 అక్టోబర్ రోజు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ప్రస్తుత కొనసాగుతున్న ఐపీఎల్ ముగియగానే అధికారికంగా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.

    హైదరాబాద్ వేదికగా దాయాది జట్ల పోరు..

    World Cup లో భారత్ తన మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ కొనసాగే అవకాశం ఉంది. ఇక దాయాది జట్లు భారత్ పాక్ లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశారు. కానీ అహ్మదాబాద్ లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పీసీబీ చీఫ్ నజామ్ సేథి దుబాయ్ లోని ఐసీసీ కార్యాలయాన్ని సంప్రదించి మ్యాచ్ విషయంపై మాట్లడారు. పాక్ విముఖత మేరకు హైదరాబాద్ లో మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

    పాక్ మ్యాచ్ లు అన్నీ దక్షిణాదిలోని ప్రముఖ నగరాల్లో ఆడనుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూర్ లో కొనసాగుతాయి. భారత్-పాక్ మ్యాచ్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హఎచ్‌సీఏ)కు ఇప్పటికేసమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు ప్రారంభమవుతాయని. అక్కడి రాజకీయాలు, తదితరాలను కూడా దృష్టిలో ఉంచుకొని మ్యాచ్ నిర్వహణపై బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యలో త్వరలో దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Pawan Nomination : పవన్ నామినేషన్.. జనసేన భారీ ర్యాలీ

    Pawan Nomination : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నామినేషన్...

    Peddapally District : పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

    Peddapally District : పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న...

    AP 10th Results : టెన్త్ ఫలితాల్లో.. రాష్ట్ర చరిత్రలో అత్యధిక మార్కులు

    599 మార్కులు సాధించిన మనస్వి AP 10th Results : ఏపీ...

    Kondagattu : కొండగట్టు అంజన్న దర్శనానికి 3 గంటలు – భారీ సంఖ్యలో తరలివస్తున్న దీక్షాపరులు

    Kondagattu Anjaneya Swamy : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Moosapet : కామాంధుల ఘాతుకం.. మహిళ మృతి

    Moosapet : హైదరాబాద్ లో ఇద్దరు కామాందుల ఘాతుకానికి ఓ మహిళ...

    Telangana Ooty : తెలంగాణ ఊటీ ఇదీ.. అక్కడికి ఎలా వెళ్లాలంటే?

    Telangana Ooty : మనదేశంలో చల్లని ప్రదేశాలు ఊటీ, కొడైకెనాల్ వెంటనే...

    RCB : ఆర్సీబీ ఫ్లే ఆప్స్ కు వెళ్లే అవకాశముందా?

    RCB : ఆర్సీబీ అంటేనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టీం....

    New Zealand Vs Pakistan : పాకిస్థాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం

    New Zealand Vs Pakistan : న్యూజిలాండ్, పాకిస్థాన్ ల మధ్య...