
India Road Network : నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టాక ప్రపంచ దేశాల్లో ముందు వరుసలోకి వెళ్తుంది భారత్. రీసెంట్ గా ఎకానమీలో 10వ స్థానం నుంచి ఎగబాకి 5వ స్థానానికి చేరుకుంది. ఇక ప్రపంచ వ్యాప్త కంపెనీలు సైతం భారత్ కేంద్రంగా పని చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీ యాపిల్ తన ఉత్పత్తులను భారత్ లో ప్రారంభించింది. బ్రిటన్ కు చెందిన మరో సెల్ సంస్థ నథింగ్ కూడా త్వరలో భారత్ లో తన తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు రావాలంటే వాటికి కావాల్సిన అన్ని వసతులు ఉండాలి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ కోసం రోడ్ కనెక్టివిటీ బాగుండాలని భావించారు నరేంద్ర మోడీ. అందుకే దేశంలో 9 సంవత్సరాల కాలంలో 1.45 లక్షల కిలో మీటర్ల మేర రోడ్డును విస్తరించారు. దీంతో భారత్ ప్రపంచంలోని అత్యధిక రోడ్డు నెట్ వర్క్ కలిగి ఉన్న దేశాల సరసన చేరింది. ఈ విషయంలో సెకండ్ ప్లేస్ లో ఉన్న చైనాను వెనక్కు నెట్టింది. భారత్ సెకండ్ ప్లేస్ ఆక్రమించుకుంది.
మోడీ ప్రధాని అయ్యేందుకు ముందు వరకు కేవలం 91,287 కిలో మీటర్లు మాత్రమే రోడ్డు ఉండేది. ఇప్పుడు ఏకంగా 1.45లక్షలకు విస్తరణ జరిగిందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తను పదవి చేపట్టినప్పటి నుంచి సాధించిన విజయాలను ఆయన వివరించారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేలను అందుబాటులోకి తెచ్చానని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆప్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వే దాదాపు పూర్తయిందని త్వరలో ప్రారంభిస్తామని, ఇది ఇండియాలోనే అత్యంత పొడవైనదని మంత్రి వెల్లడించారు. 2019 ఏప్రిల్ నుంచి ఎన్‌హెచ్ఏఐ 30వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ హైవేలను నిర్మిచాం, ఇందులో ఢిల్లీని మీరట్‌తో లక్నోను యూపీలోని ఘాజీపూర్‌తో కలిపే ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.
ఎన్‌హెచ్ఏఐ రోడ్ల నిర్మాణంలో ప్రపంచ రికార్డులు కూడా ఉన్నాయిని వాటిలో ఈ ఏడాది మేలో యూపీలోని ఘజియాబాద్ – అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వేను ఎన్‌హెచ్ఏఐ 100 గంటల్లో 100 కిలో మీటర్ల నిర్మించి రికార్డు నెలకొల్లింది. గతేడాది ఆగస్టులో ఎన్‌హెచ్ఏఐ-53లో అమరావతి – అకోలా మధ్య 75 కిలో మీటర్ల నిరంతర సింగిల్ బిటు మినస్ కాంక్రీట్ రహదారిని 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసి మరో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. 9 సంవత్సరాల్లో టోల్ ఆదాయం భారీగా పెరిగింది. తొమ్మిదేళ్ల క్రితం రూ. 4,770 కోట్లు ఉన్న టోల్ వసూళ్లు రూ. 41,342 కోట్లకు పెరిగిందని మంత్రి మీడియాకు వివరించారు. కేంద్రం టోల్ ఆదాయాన్ని 1.30 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుందని గడ్కరీ చెప్పారు.