India TV-CNX Opinion Poll :
సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నది. అయితే ఇప్పటికే పలు సంస్థలు పబ్లిక్ మూడ్ పేరిట సర్వేలు వెల్లడిస్తు్న్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అవి ఈ రిపోర్టుల ద్వారా ప్రకటిస్తున్నాయి.
అయితే ఇటీవలే ఓ మీడియా సంస్థ దేశవ్యాప్తంగా లోక్ సభ సీట్ల పై సర్వే నిర్వహించి ప్రకటించింది. కాగా , తాజాగా ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపినియన్ పోల్ ను బయటపెట్టింది. అయితే ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే సంఖ్య అని మాత్రమే ప్రకటించింది. ఇప్పుడైతే ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీలు తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అయితే తాజాగా వెల్లడైన ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఫలితాలు షాకింగ్ గా మారాయి. ఈ సర్వే ప్రకారం కేంద్రంలో మూడో సారి కూడా నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది.అయితే విపక్షాల కూటమి నుంచి మాత్రం గట్టి పోటీ ఎదురవుతుందని అంచనా వేసింది.
అయితే ఇక ఏపీ విషయానికి వస్తే.. లోక్ సభ సీట్లలో మెజార్టీ స్థానాలు అధికార పార్టీకే దక్కుతాయని సర్వే ఫలితాలు వెల్లడించింది. ఏపీలో మొత్తం 25 సీట్లకు గాను 18 ఎంపీ స్థానాలు వైసీపీకే దక్కుతాయని స్పష్టం చేసింది.
టీడీపీ కి 7స్థానాలు వస్తాయని చెప్పింది. అయితే ఈ లెక్కన చూసుకుంటే అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 126, టీడీపీ 49 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో జనసేనను పరిధిలోకి తీసుకోలేదు.
బీజేపీ కి మాత్రం 8 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేస్తున్నది. 46 శాతం ఓటింగ్ షేర్ తో వైసీపీ, 36 శాతం ఓటింగ్ తో టీడీపీ రెండోస్థానానికి పరిమితమవుతుంది. అయితే వైసీపీ సింగిల్ గా ఈ మెజార్టీ సాధిస్తుందని అంచనావేసింది.
కానీ ఇక్కడ జనసేనను కలపకుండా ఈ సర్వే కొనసాగింది. ఇప్పుడు జనసేన, టీడీపీ ఓట్లు కలిసి పోతే ఈ లెక్క మారిపోతుందని ఆ రెండు పార్టీల శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. ఇక తమ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇక మరోవైపు తెలంగాణలో షాకింగ్ లెక్కలు బయటకు వచ్చాయి. తెలంగాణ లో 17 ఎంపీ స్థానాలకు గాను అధికార బీఆర్ఎస్ 8, బీజేపీ 6, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని ఈ సర్వే తెలిపింది.
అయితే తెలంగాణ ప్రస్తుత పరిస్థితులకు ఈ సర్వే అద్దం పట్టినట్లు కనిపించడం లేదు. ఎంపీ స్థానాలకు వదిలేస్తే , అసెంబ్లీ పరిధిలో ప్రస్తుతం కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉండేలా కనిపిస్తున్నది. బీజేపీ మూడో స్థానానికి పరిమితమని తెలంగాణలో ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. అయితే ఈ సర్వే పోల్ సరిగా లేదని అంతా అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై పెదవి విరుస్తున్నారు.