21.6 C
India
Wednesday, February 11, 2026
More

    India VS Australia : నేడే డబ్లూటీసీ ఫైనల్.. టీమిండియా తుది జట్టులో ఉండేదెవరు..?

    Date:

     

    IndiaVS Austrila
    IndiaVS Austrila

    India VS Australia : మరికాసేపట్లో భారత్, అస్ర్టేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ప్రారంభం కాబోతున్నది.  లండన్ లోని ఓవల్ మైదానం ఇందుకు వేదిక కాబోతున్నది. బుధవారం నుంచి ఈనెల 11 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి, కప్పుతో ఇండియాకు చేరుకోవాలని రోహిత్ సేన భావిస్తు్న్నది. ఈ క్రమంలో ఇప్పుడు తుది జట్టులో ఎవరెవరికి అవకాశం వస్తుందనేది కీలకం కానుంది. బలమైన జట్టుతో బరిలోకి దిగితేనే ఆస్ర్టేలియాపై పై చేయి సాధిస్తామని టీమిండియా భావిస్తున్నది. మైదానంలో పరిస్థితులను బట్టి తుది జట్టును ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది.

    పాత జట్టేనా..?
    ఆస్ర్టేలియా నాలుగో టెస్టు ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతారని  అంతా అనుకుంటన్నారు. ఒకరిద్దరు మినహా అంతా తుది జట్టుకు ఎంపికవుతారని తెలుస్తున్నది. రోహిత్, శుభ్ మన్ గిల్, పూజారా, కోహ్లీ ప్రధానంగా ఉంటారు. ఇక శ్రేయాస్ అయ్యర్ స్థానంలో రహానేకు చాన్స్ దక్కే అవకాశం ఉంది. రవీంద్ర జడేజాకు కూడా జట్టులో ఆల్ రౌండర్ గా చొట్టు దక్కేలా కనిపిస్తున్నది.

    అయితే ఇప్పుడు మైదానంలో బౌలర్ల ఎంపికే కీలకం. మైదానాన్ని బట్టి పేసర్లు, స్పిన్నర్లకు అవకాశం దక్కనుంది. మరి అశ్విన్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జైదేవ్ లో ఎవరికి చాన్స్ దక్కుతుందోననే చర్చ కొనసాగుతున్నది. మరోవైపు రెండో స్పిన్నర్ అవసరం లేదనుకుంటే శార్దూల్ ఠాకూర్ కు కూడా అవకాశం దక్కుతుంది.

    ఇక వికెట్ కీపర్ విషయానికి వస్తే  కేఎస్ భరత్ కు అవకాశం దక్కే చాన్స్ ఉంది. మరోవైపు దూకుడుగా ఆడే ఇషాన్ కిషన్ కు ఈ మ్యాచ్ లో చాన్స్ ఇస్తారో లేదో అనుమానంగానే ఉంది. ఇషాన్ కు ఇది తొలి టెస్ట్ కానుంది. మరి ఆరంగేట్రమే ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కానుంది. ఏదేమైనా బలమైన ప్రత్యర్థి కావడంతో అందుకు తగ్గట్టుగానే జట్టు కూర్పు ఉండే అవకాశం ఉంది. రోహిత్ ఈమేరకు జట్టు మేనేజ్ మెంట్ తో కలిసి
    నిర్ణయం తీసుకోనున్నారు. ఈ చాంపియన్ షిప్ ను సాధించడం ద్వారా టీమిండియా సత్తా మరోసారి చాటాలని రోహిత్ సేన భావిస్తున్నది. విదేశీ గడ్డపై జరుగుతున్న ఈమ్యాచ్, అందులోనూ ఆస్ర్టేలియాతో ఫైనల్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Australia : ఆస్ట్రేలియాతో ఎంపికైన టెస్టు జట్టు ఇదే

    Australia : ఆస్ట్రేలియా వెళ్లనున్న టీంలో సర్పరాజ్ ఖాన్ చోటు  దక్కించుకున్నాడు....

    India VS Australia Final ODI : రేపే భారత్, ఆస్ర్టేలియా ఆఖరి వన్డే.. ఇక్కడే వరల్డ్ కప్ టీం ఎంపిక?

    India VS Australia Final ODI : భారత్. అస్ర్టేలియాల మధ్య...

    India vs Australia : ఆస్ట్రేలియాతో ఢీకి టీమిండియా రెడీ.. తుది జట్టులో వారికే చాన్స్..

    India vs Australia : ప్రపంచకప్ కు ముందు ఆస్ర్టేలియా జట్టుతో...