
Former Cisco CEO : విదేశీ టూర్ లో ఉన్న ప్రధాని మోడీని ఆయా దేశాల అధ్యక్షులు ప్రముఖులు, బిజినెస్ టైకూన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నరేంద్ర మోడీ గురించి సిస్కో సిస్టమ్స్ మాజీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్, సీఈవో జాన్ థామస్ అమెరికాలోని, వాషింగ్టన్ డీసీలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఆయనో గొప్ప నేతగా అభివర్ణించారు. ఆయనతోనే ప్రపంచ స్థితిగతులు మారేందుకు అవకాశం ఉందని చెప్పారు. అమెరికాలోని ఒక కార్యక్రమంలో మోడీతో కలిసి పాల్గొన్న ఆయన మోడీని పొగడ్తలతో ముంచెత్తారు.
తన జీవితంలో మోడీ అంత గొప్ప వ్యక్తి చూడలేదని అన్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రభావితమైన వ్యక్తిని నేను ఏన్నడూ చూడలేదని చెప్పాడు. అతడే ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తాడని కొనియాడాడు. ఇప్పటి వరకు ఉన్న నేతల్లో విజినరీ కలిగి ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అని వ్యాఖ్యానించారు. ఆయన ఎంతో ఎనర్జటిక్ గా కూడా ఉంటాడని కూడా చెప్పారు. ఆయనతోనే ఆయన హాయాంలోనే ప్రపంచం మారుతుందన్నారు. ఇన్నేళ్ల ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షుల్లో కెల్లా ఒక డిఫరెంట్ వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు.
టెక్నాలజీని ఆయన వినియోగించుకున్నంత ఎవరూ వినియోగించుకోరని చెప్పారు. తన దేశాన్ని కూడా టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. డిజిటల్ ఇండియాను చేయడంలో ఆయన కృషి అమోఘమని కొనియాడారు. ఇది భవిష్యత్ ను మరింత ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఇండియా నెమ్మది నెమ్మదిగా ఎదుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఎకానమీలో 5వ స్థానానికి వచ్చిన దేశం రెండేళ్లలో మూడో స్థానానికి వస్తుందని, ఆయన ఆధ్వర్యంలోనే ప్రపంచంలోనే నెం1 ఎకానమీ కలిగిన దేశంగా మారుతుంది జోస్యం చెప్పారు. ‘నేను నా జీవింతలో ఇలాంటి లీడర్ ను నమ్మతాను’ అన్నారు.