చైనా దురాక్రమణకు పాల్పడితే భారత సైనికులు ఎంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించారో స్పష్టం చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండేళ్ల క్రితం భారత్ – చైనా సైనికుల మధ్య గాల్వన్ లోయలో భీకర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆ సంఘటనలో భారత సైనికులు 20 మంది వరకు చనిపోయారు. ఇక అదే ఘటనలో 40 మందికి పైగా చైనా సైనికులు చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కట్ చేస్తే డిసెంబర్ 9 న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ దగ్గర మళ్ళీ చైనా సైనికులు సరిహద్దు రేఖ ను దాటుతూ భారత భూభాగం లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించడంతో భారత సైనికులు ధీటుగా సమాధానం ఇచ్చారు. కర్రలతో చైనా సైనికుల ఆట కట్టించారు. భారత భూబాగంలోకి చొచ్చుకు రాకుండా భారత సైనికులు ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత సైనికుల ధైర్య సాహసాలను కళ్ళకు కట్టినట్లు చూపించే ఈ వీడియో చూసి” భళా ……. భారత సైనికా ” అంటూ సెల్యూట్ చేస్తున్నారు నెటిజన్లు. చైనా సైనికుల తోక ముడిచేలా భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యాన్ని చూసి శభాష్ అంటూ సైనికులకు జేజేలు పలుకుతున్నారు. ఈ వీడియో ను మీరు చూడండి.
“जीवन उनका नहीं युधिष्ठिर! जो उससे डरते है, वह उनका है, जो चरण रोप, निर्भय होकर लड़ते है!” 🇮🇳 pic.twitter.com/jkvSTHfkXT
— Anupam Kher (@AnupamPKher) December 14, 2022