
భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. భారీ కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో రిషబ్ పంత్ కారు పూర్తిగా తగలబడిపోగా స్వల్ప గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రూర్కీ దగ్గర డివైడర్ ను ఢీకొన్న రిషబ్ పంత్ కారు పూర్తిగా దగ్దమైంది. భారత క్రికెటర్ గా రిషబ్ పంత్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.