
Indian dies in US : అమెరికాలోని జరిగిన యాక్సిడెంట్ లో ఓ భారతీయుడు మృతి చెందాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను జంప్ చేసిన కారు వేగంగా భారతీయుడిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలైన ఆయన అక్కడిక్కడే మరణించాడు. సోమవారం (మే 15 వ తేదీ) జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. 32 ఏళ్ల వయస్సున్న మరియప్పన్ సుబ్రహ్మణియన్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తో టెస్ట్ లీడ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లిన ఆయన ఒక కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకున్న ఆయన భార్య, నాలుగు సంవత్సరాల కొడుకును ఇండియాలోనే వదిలి ఉద్యోగ రిత్యా అక్కడికి వెళ్లారు. ఈయన గతంలో జాక్సన్ విల్లేలో నివాసం ఉండేవారు. రీసెంట్ గా ఫ్లొరిడాలోని టంపాకు మారారు. అయితే టంపా మిల్స్ బరో కౌంటీలో పాదచారుల క్రాసింగ్ వద్ద అతను రోడ్డు క్రాస్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారు మరియప్పన్ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడిఉన్న ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆయనను ఢీ కొట్టిన కారు సమీపంలోని సిగ్నల్ ను జంప్ చేసి వచ్చినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
తన భర్త మృతదేహం ఇండియాకు రప్పించాలని ఆయన భార్య ప్రభుత్వాలను వేడుకుంటుంది. అయితే ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కొందరు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరుతున్నారు. మీరు ఇచ్చే సాయం వారికి జీవిత కాలం గుర్తుకు ఉంటుందని చెప్తున్నారు. ‘మరియప్పన్ సుబ్రహ్మణియన్ చదవడంలో సహాయపడటానికి గో ఫౌండ్ మీ (GoFundMe’ పేజీని ఏర్పాటు చేసారు.
మరియప్పన్ మృతదేహం ఇండియా పంపించేందుకు టంపాలోని జాక్సన్‌విల్లేలోని కమ్యూనిటీ గ్రూపులు సన్నాహకాలు నిర్వహిస్తు్న్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు పంపించనున్నామని అక్కడి ఇండియన్స్ చెప్తున్నారు.