స్టూడెంట్ వీసాలను తీసుకొని అమెరికా , బ్రిటన్ , న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్తున్నారు ఇండియన్ స్టూడెంట్స్. అయితే ఆయా దేశాల్లో అడుగుపెట్టిన తర్వాత స్టూడెంట్ వీసాను కాస్త స్కిల్డ్ వర్కర్ వీసా కు మార్చుకుంటున్నారు. ఇలా ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ మార్చుకుంటున్నారు. ఉన్నత చదువుల నిమిత్తం ఫారిన్ వెళ్తున్న వాళ్ళు ఇలా అర్దాంతరంగా చదువు మధ్యలో మానేయ్యడానికి కారణం ఏంటో తెలుసా……..
డైరెక్ట్ గా స్కిల్డ్ వర్కర్ వీసా దొరకడం కష్టం కాబట్టి.
ఇండియాలో ఉండి నేరుగా ఆయా దేశాల్లోకి స్కిల్డ్ వర్కర్ వీసాతో వెళ్లడం కష్టం కాబట్టి , ముందుగా ఉన్నత చదువుల కోసమని స్టూడెంట్ వీసా పొందుతున్నారు. ఆ వీసా రాగానే స్టూడెంట్ లో ఆ దేశంలో అడుగుపెట్టి ……. ఎంచక్కా స్కిల్డ్ వర్కర్ వీసా కు మారుతున్నారు. మన స్టూడెంట్స్ లో స్కిల్ ఉంది కాబట్టే స్కిల్డ్ వర్కర్ వీసా పొందుతున్నారు. లేదంటే రాదు కదా …… అయితే అందుకోసం మాత్రం ఇలా స్టూడెంట్ వీసా కు ఎక్కుపెడుతున్నారు. అదన్న మాట అసలు విషయం.