Indo American Fair :
అమెరికాలో ఏదో ఒక మూల ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. నాటా, తానా సభలు ఇవి అత్యంత వైభవంగా కొనసాగాయి. అయితే ఇవన్నీ ఒక్క తెలుగు వారికి సంబంధించినవే. వీటితో పాటు నార్త్, సౌత్ ప్రాంతానికి చెందిన వారి కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే ‘ఇండో అమెరికన్ ఫెయిర్’ నిర్వహించనున్నారు. అయితే వీటిలో ప్రోగ్రామ్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.
ఇండియా నుంచే కాకుండా దక్షిణ ఆసియా ఖండంకు చెందినది ఈ ఫెయిర్ నిలవనుంది. దీన్ని గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తుండగా ఇది 20 ఆన్యువల్ ఈవెంట్. 3 సెప్టెంబర్, 2023 (ఆదివారం)న ఈవెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు వివరించారు. కార్యక్రమం ‘మెర్సర్ కంట్రీ పార్క్, వెస్ట్ విండ్ సోర్, న్యూ జెర్సీ 08550’లో కొనసాగుతుందని చెప్పారు. ఈ ఫెయిర్ లో లైవ్ పర్ఫార్మెన్స్ తో పాటు షాపింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెల్లరీ, బాలీవుడ్ సింగింగ్, ఇండియన్ కుసిన్, కార్పొరేట్ బూత్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయని చెప్పారు. అయితే సౌత్ ఆసియా నుంచి వేలాది మంది ఈ ఫెయిర్ కు వస్తారని నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు.
మరిన్ని వివరాలకు www.indoamericanfair.com లో సంప్రదించాలని సూచించారు. యాడ్స్, ఇంకా స్పాన్సర్ షిప్ కోసం అరుణ్ 609-937-2806, ప్రియాంక 609-246-2795, డింపుల్ 609-240-2191లో సంప్రదించవచ్చని చెప్పారు.