
ఇండోనేషియాలో నిన్న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్ పై 6.9 నుండి 5.6 గా నమోదైంది. దాంతో పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపంలో ఇప్పటి వరకు 162 మంది మరణించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు. పెద్ద మొత్తంలో భవనాలు నేలమట్టం కావడంతో ఆ శిధిలాల కింద ప్రజలు చిక్కుకొని ఉంటారని దాంతో మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలుస్తోంది.