29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Innovation : మంచమే కారు.. వీడి తెలివికి జోహార్లు

    Date:

    Innovation
    Innovation, Bed BIke

    Innovation : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నారో సినీకవి. తెలివి ఎవరి సొత్తుకాదమ్మా తోటకూర సుబ్బమ్మా అంటారు. చీకటిని చూసి తిట్టుకునే కంటే అందులో ఓ చిరుదీపం వెలిగించడం మంచిది. మన ఆలోచనలు ఎలా ఉంటే మన పనులు కూడా అలాగే ఉంటాయి. మన మెదడు మొద్దుబారిపోతే మనకు ఆలోచనలు రావు. మన మెదడు సరిగా పనిచేస్తే మన ఆలోచనలు కూడా కొత్త రూపు సంతరించుకుంటాయి. దీంతో మనం నూతన ఆవిష్కరణలు కనిపెట్టడం సులభమే. దీనికి గాను మన ఆలోచనలు పదునుగా ఉండాలి అంతే.

    పుర్రెకో గుణం జిహ్వకో రుచి అన్నారు. ప్రతి మనిషి మెదడు 1350 గ్రాములే ఉంటుందట. దాన్ని ఉపయోగిచంచుకునే తీరును బట్టి అది మారుతుంది. మన ఆలోచనలు మంచి వైపు సాగుతాయి. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు తాను అనుకున్నది సాధించాడు. మంచానికే వాహనం ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో ఆటో మాదిరి కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని ఎటైనా వెళ్లొచ్చు.

    దీనికి సంబంధించిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. అతడు తయారు చేసిన వాహనంతో దర్జాగా వెళ్తున్నాడు. అచ్చం బండి మాదిరే చేయడం గమనార్హం. దీంతో అందరు దాన్ని వింతగా చూస్తున్నారు. రోడ్డు మీద వెళ్తుంటే ఎలా తయారు చేశాడని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. అతడి తెలివికి ఫిదా అవుతున్నారు. ఇంత సూక్ష్మబుద్ధితో తయారు చేసిన వాహనం గురించి తెలుసుకుంటున్నారు.

    ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వాహనం సంచలనం కలిగిస్తోంది. మంచంతో ఇలా తయారు చేయడంతోనే అందరు అవాక్కవుతున్నారు. మంచమే కదిలే పుష్పక విమానమా? అని ప్రశ్నిస్తున్నారు. అతడు చేసిన ప్రయోగాన్ని ప్రశంసిస్తున్నారు. ఆలోచిస్తే మన మెదడులో ఎన్నో ఆవిష్కరణలు బయటకు వస్తాయని అతడు కార్యరూపంలో నిరూపించాడు.

    ఇక ఈ మంచు కారు ఆవిష్కరణ చూసి సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అందుకే ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ ఇండియాకు రావడం లేదని.. తన టెస్లా కార్లను ఇండియాలో ప్రవేశపెట్టడం లేదని సెటైర్లు వేస్తున్నారు. ఇలా మంచాలతో కార్లు తయారు చేస్తున్న భారతీయులతో పోటీపడడం సాధ్యం కాదనే ఇండియాలో వ్యాపారం ప్రారంభించలేదని జోకులు వేసుకుంటున్నారు. ఇంతటి వినూత్న ఆవిష్కరణలకు వేదికగా భారత్ మారుతుండడం హర్షించదగ్గ విషయంగా చెప్పొచ్చు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related