
Samyukta : వరుస సినిమాలతో టాలీవుడ్ లో గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయిన బ్యూటీ సంయుక్త మీనన్.. ఈమె గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. భీమ్లా నాయక్ సినిమాతో ఈమె ఎంట్రీ ఇచినప్పటి నుండి వరుసగా ఆఫర్స్ అందుకుంటూనే ఉంది. వచ్చిన ప్రతీ సినిమా హిట్టే తప్ప ఒక్క ప్లాప్ కూడా లేదు..
దీంతో ఈమెకు గోల్డెన్ హీరోయిన్ అని లక్కీ హీరోయిన్ అని అంతా పిలుచు కుంటున్నారు.. బింబిసారా, సార్, విరూపాక్ష వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో ఈమె పేరు మారుమోగి పోతుంది.. ఇక ఈమె గురించి త్రివిక్రమ్ గురించి చాలా రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈమెకు ఆఫర్స్ రావడానికి తెరవెనుక త్రివిక్రమ్ ఉన్నారని టాక్ నడుస్తుంది.
అయితే ఈ విషయాల్లో నిజమెంతో తెలియదు.. ఇది పక్కన పెడితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ తో ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఈమె మాట్లాడుతూ.. నేను ఇప్పటికే 20 సినిమాల్లో నటించానని ప్రతీ సినిమా స్క్రీన్ టెస్ట్ లో పాల్గొంటాను..
ఈ స్క్రీన్ టెస్ట్ లో ఎమోషన్, దయ, ఏడవడం, నవ్వడం, శృంగారం, జాలి వంటి అన్ని ఎమోషన్స్ ను పండిస్తాను.. అయితే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో నా కళ్ళు చాలా చిన్నగా ఉన్నాయని చాలా మంది విమర్శించారు.. కానీ ఇప్పుడు మాత్రం కళ్ళతోనే అన్ని హావభావాలు పలికిస్తున్నావు అంటూ మెచ్చుకుంటూ ఉంటే బాగుంది అంటూ ఈమె చెప్పుకొచ్చింది.