21 C
India
Sunday, February 25, 2024
More

    Intellectuals : దేశంలో మేధావులు పడ్డారు..!

    Date:

    Intellectuals
    Intellectuals in India

    దేశంలో మేధావులు పడ్డారు;
    బండరాళ్లు‌ తలపైన పడ్డట్టుగా,
    ముళ్ల‌ వానవచ్చినట్టుగా,
    క్రూరమృగాలు మీద పడినట్టుగా,
    ఘోర సర్పాలు ఒంటిమీద పడినట్టుగా,
    దేశంలో మేధావులు పడ్డారు.

    సమాజం
    మంటల్లో చిక్కుకున్న వనం అయింది;
    మనుగడ
    మరుగుతున్న నీళ్లలో మునిగిన‌ తల అయింది‌.

    పెరిగిన మేధ పగుళ్లకు కారణమయింది;
    అభద్రత వచ్చిన జ్ఞానానికి ఫలితం అయింది.

    చదువు‌ విదేశీ భావజాలం దగ్గఱ
    ఊడిగం‌ చేస్తోంది;
    ఈ గడ్డను పాడుచెయ్యడానికి
    విద్య విజృంభిస్తోంది.

    మేధావులు దేశాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు;
    తమ బుఱ్ఱల్లోని రోగాల్ని ఈ మట్టికి అంటిస్తున్నారు.

    మేధ అన్న విషం ఒలికింది;
    అది దేశమంతా చిందింది.
    శుభ్రం చేసుకోవడం మన బాధ్యత;
    దేశ శుభ్రతే దేశ భద్రత.

    పామరులారా,
    సామాన్యులారా,
    ఈ మట్టి మనది,
    ఈ సమాజం మనది,
    ఈ దేశం మనది.

    పామరులారా,
    సామాన్యులారా,
    మేధావుల భ్రష్టత్వం
    సాహిత్యం కాదు;
    మేధావుల మొరుగుడు సంగీతం అవదు;
    మేధావులకు మనం బలి కాకూడదు.

    పామరులారా రండి,
    సామాన్యులారా రండి,
    ప్రజలారా రండి;
    మేధావుల్ని తన్ని తరిమేద్దాం;
    మేధావుల పీడను వదిలించుకుందాం.

    వక్రతకు అతీతంగా,
    ఛిద్రం అయిపోకుండా
    మామూలుగా ఉందాం;
    నిమ్మళంగా బతుకుదాం.
    మనల్ని మనం దక్కించుకుందాం.

    మనం మన దేశాన్ని నిలుపుకుందాం;
    మన సంతతికి ఈ దేశాన్ని
    సంపదగా అందిద్దాం.

     

     

     

    – రోచిష్మాన్
    9444012279

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ROCHISHMON: మేధావుల్లారా, మీరు మాకు వద్దు.

                              మేధావుల్లారా, మీరు మాకు వద్దు ----------------- మీ వక్రపుటాలోచనల విషాన్ని మాపై ఒంపకండి; మీ...