34.7 C
India
Monday, March 17, 2025
More

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    Date:

    interest rates
    interest rates

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను సవరించడంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. వడ్డీ రేట్లు తగ్గడంతో దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు.

    సామాన్య ప్రజలకు ఊరట..

    రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. 6.50 శాతం ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గించామన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. గడిచిన ఐదేళ్లలో తొలిసారి రెపో రేటును తగ్గించడంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది.

    రెపో రేట్ల తగ్గింంపుపై సమర్థన

    లోన్లపై ఈఎంఐ తగ్గించాలనే డిమాండ్ ఎంతోకాలంగా ఉంది. ఆర్‌బీఐ ఎంపీసీపై కూడా చాలా ఒత్తిడి ఉంది. గత కొన్ని సమావేశాల్లో ఎంపీసీలోని కొందరు సభ్యులు రెపో రేట్ల తగ్గింపును సమర్థించారు. కానీ ఎక్కువ మంది సభ్యులు మాత్రం రెపో రేటును మార్చకుండా అలాగే ఉంచాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్బీఐపై ఒత్తిడి పెంచింది. అయితే సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెపో రేటులో సవరణలు చేస్తారని చాలామంది భావించినట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు..

    Share post:

    More like this
    Related

    Journalists Revathi : జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్ కు బెయిల్

    Journalists Revathi Bail : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన...

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా...

    Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. మోడీ ట్రీట్ మెంట్ ఇట్లుంటదీ

    Manipur : మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    Bank account, బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త…….

    రెండేళ్లుగా బ్యాంకు లావా దేవిలు నిర్వహించకపోయినా ,జీరో బ్యాలెన్స్ ఉన్నా ఖాతాదారులకు...

    AP Debts : రికార్డు అప్పుల్లో ఏపీ.. మరింత కావాలని అడుగుతున్న ప్రభుత్వం!

    AP Debts : ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో రికార్డు నెలకొల్పేలా కనిపిస్తోంది. 2024లో...