21.6 C
India
Wednesday, February 11, 2026
More

    MS Dhoni : అంతా బాగుంటే మళ్లీ వస్తా.. ధోనీ సంచలన ప్రకటన

    Date:

    MS Dhoni
    MS Dhoni

    MS Dhoni : ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో CSK IPL 2023 టైటిల్‌ను గెలుచుకుంది. చెన్నైకి 5వ టైటిల్ గెలిచిన తర్వాత, MS ధోని IPL నుండి రిటైర్మెంట్ పై  ప్రకటన చేశాడు.  తన రిటైర్‌మెంట్‌పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసిన ధోని  అభిమానుల ప్రేమను చూసి, వారికి బహుమతి ఇచ్చేందుకు వచ్చే సీజన్‌లో కూడా ఆడతానని చెప్పాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇది ధోనీకి చివరి సీజన్ అని ఊహాగానాలు వస్తున్నాయి.

    గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత, ఇదే ఆఖరి సీజన్ అని ధోనిని ప్రశ్నించగా? పరిస్థితులు చూస్తుంటే రిటైరయ్యేందుకు ఇదే సరైన సమయమని ధోనీ పేర్కొన్నాడు. నేను ఇప్పుడు రిటైర్ అవుతున్నాను అని చెప్పడం చాలా సులభం, కానీ రాబోయే 9 నెలలు కష్టపడి తిరిగి రావడం, మరో సీజన్ ఆడడం చాలా కష్టం. శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

    నా కెరీర్‌లో ఇది చివరి దశ..
    చెన్నై అభిమానులు నాకు ప్రేమను అందించిన తీరు, నేను వచ్చే సీజన్‌లో కూడా ఆడతాను. వారికి నా వైపు నుంచి కూడా  బహుమతి ఇవ్వాలనుకుంటున్న. ఐపీఎల్ కెరీర్‌లో ఇదే నా చివరి దశ అని.. ఇక్కడి నుంచి మొదలై స్టేడియం అంతా నా పేరు మార్మోగిందని చెప్పుకొచ్చాడు. చెన్నైలోనూ ఇదే జరిగింది.  మైదానంలో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ అనుభూతి మర్చిపోలేనిది.  సాధ్యమైనంత వరకు తిరిగి రావాలనే నేనూ ఆశిస్తున్న. అందుకు నా శరీరం కూడా సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్న. అని ధోనీ తన అభిమానుల పై కృతజత చాటుకున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Chris Gayle : టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. వాళ్లు కూడా ఓకే : క్రిస్ గేల్..!

    Chris Gayle : గ్రేట్ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియా...

    MS Dhoni : ధోని బ్యాటింగ్ కు దిగే సమయంలో ఆకాశం వైపు ఎందుకు చూస్తాడో తెలుసా?

    MS Dhoni : ఎంఎస్ ధోని ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కు...